Tuesday, April 30, 2024

నన్ను వేధిస్తుంటే మీకు బాధగా లేదా?

- Advertisement -
- Advertisement -
Kangana Ranaut questioned Sonia Gandhi
సోనియా గాంధీని ప్రశ్నించిన కంగన

ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వంపై నిన్నటివరకు విమర్శనాస్త్రాలు సంధించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తన దృష్టిని మళ్లించారు. ఒక మహిళపై జరుగుతున్న వేధింపులను అడ్డుకోవాలంటూ సోనియాకు ఆమె విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలో మీ ప్రభుత్వం నా ప్ట వ్యవహరిస్తున్న తీరు మిమల్ని బాధించడం లేదా అంటూ ట్విట్టర్ వేదికగా కంగనా కాంగ్రెస్ అధినేత్రిని ఉద్దేశించి ప్రశ్నించారు.

డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ సూత్రాలను పరిరక్షించాలంటూ మీ ప్రభుత్వాన్ని మీరు కోరలేరా అంటూ ఆమె అడిగారు. మీ సొంత ప్రభుత్వమే ఒక మహిళను వేధిస్తూ, శాంతి భద్రతలను అపహాస్యం చేస్తుంటే మీరు మౌనంగా, నిరాసక్తంగా ఉండడంపై కాలమే తీర్పు చెబుతుందని కంగన వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంలో మీరు జోక్యం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆమె సోనియాను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

Kangana Ranaut questioned Sonia Gandhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News