Thursday, May 9, 2024

బాబాయ్‌ను పొడిచిన అబ్బాయ్..

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్రలో ఎన్‌సిపి నేతలు శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య ఆధిపత్య పోర్లు క్లైమాక్స్ దశలో రాజమౌళి సినిమా బాహుబలి పోస్టరు ఆకట్టుకొంటోంది. ఆ బ్లాక్‌బస్టర్ సినిమాలో బాహుబలి వెన్నంటి తిరిగే నమ్మకస్థుడు కట్టప్ప ఏకంగా బాహుబలిని వెనక నుంచి కత్తితో పొడిచిన ఘట్టం ఉంది. సంబంధిత సినిమాలోని ఈ పోస్టరును ఇప్పుడు దాదాపుగా దెబ్బతిన్న శరద్ పవార్ వర్గీయులు పలుచోట్ల ప్రదర్శించారు.

ఇందులో కట్టప్ప స్థానంలో అజిత్ పవార్‌ను, బాహుబలి స్థానంలో శరద్ పవార్ ఫోటోను పెట్టారు. పోస్టరుకు ద్రోహి అని పేరు పెట్టారు. ఢిల్లీలోని పవార్ నివాసం వద్ద కూడా ఈ కటౌట్లు వెలిశాయి. ద్రోహులను దేశమంతా గమనిస్తోంది. ఇటువంటి వారి ధోరణిని , వెన్నుపోటును, నమ్మకద్రోహాన్ని ప్రజలు సహించబోరని ఎన్‌సిపి విద్యార్థి విభాగం ఈ పోస్టర్లను వెలువరించిందని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News