Saturday, April 27, 2024

‘ఎన్‌సిపి-శరచ్చంద్ర పవార్’ పేరుతో పోటీకి సుప్రీం అనుమతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శరద్‌పవార్ వర్గానికి “నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరచ్చంద్ర పవార్‌” అనే పేరుతో పోటీ చేయవచ్చని సుప్రీం కోర్టు మంగళవారం అనుమతి ఇచ్చింది. దీంతోపాటు ‘మనిషి ఊదుతున్న తుర్రా’ చిహ్నాన్ని శరద్‌పవార్ వర్గం వాడుకోవచ్చని అనుమతించింది. ఈ చిహ్నాన్ని శరద్ పవార్ వర్గానికి చెందిన చిహ్నంగా రిజర్వు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆ గుర్తును ఏ ఇతర పార్టీకి లేదా అభ్యర్థికి కేటాయించరాదని స్పస్టం చేసింది. ఇదే సమయంలో ఎన్‌సిపి వ్యవస్థాపకుడు శరద్ పవార్ పేరును కానీ, ఫోటోలను కానీ, ఎన్నికల ప్రచారంలో ఉపయోగించకుండా అజిత్ పవార్ వర్గాన్ని కట్టడి చేసింది.

అలాగే గడియారం గుర్తుకు సంబంధించిన వివాదాస్పద అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ గుర్తు కోర్టు పరిశీలనలో ఉందని పబ్లిక్ నోటీస్ జారీ చేయాలని అజిత్ పవార్ వర్గానికి కోర్టు చెప్పింది. ఇంగ్లీష్, హిందీ, మరాఠీ భాషల్లో ఈనోటీసులు ఇవ్వాలని, కొన్ని ప్రచార ప్రకటనల్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించాలని సూచించింది. అంతకు ముందు అజిత్ పవార్ వర్గాన్ని నిజమైన ఎన్‌సిపీ గా ప్రకటిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఎలెక్షన్ కమిషన్ నిర్ణయంపై శరద్‌పవార్ వర్గం దాఖలు చేసిన వ్యాజ్యంపై నాలుగు వారాల్లో తమ స్పందన తెలియజేయాలని అజిత్ పవార్ వర్గానికి కోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News