Sunday, May 5, 2024

రైతు బాంధవుడు సిఎం కెసిఆర్: నల్లమోతు భాస్కర్ రావు

- Advertisement -
- Advertisement -

KCR is Farmer relative

హైదరాబాద్: రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అని ఎంఎల్ఎ నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. మిర్యాలగూడలో రైతు వేధికలను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లమోతు మీడియాతో మాట్లాడారు. ముందుచూపుతో రైతువేదికల నిర్మాణం చేశామని, రైతులకు సూచనలు, శిక్షణ కోసం రైతువేదికలు ఉపయోగపడుతాయన్నారు. దామరచర్ల సబ్ మార్కెట్ యార్డులో సిసి రోడ్డు నిర్మాణానికి రూ.80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందని, అసైన్డ్ భూమి రైతుల సమస్యలు కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని, ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో మిర్యాలగూడ నియోజకవర్గంలో నూతనంగా ఐదు లిఫ్టులు ఏర్పాటు చేశామని, సిఎం కెసిఆర్ కు ఎప్పటికి రుణపడి ఉంటామని, మరి కొన్ని రైతు వేదికలను కూడా నిర్మించుకుందామని నల్లమోతు భాస్కర్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News