Saturday, April 27, 2024

కేరళలో సంపూర్ణ లాక్‌డౌన్

- Advertisement -
- Advertisement -

Kerala Govt announces complete lockdown

తిరువంతపురం: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ మే 8 నుంచి 16వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన  ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం, రాత్రి కర్ఫ్యూను రాత్రి 9 నుండి ఉదయం 5 గంటల వరకు అమలు చేస్తన్నారు. కేరళలో నిన్న ఒక్కరోజు 41 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  రోజురోజుకు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేరళ సర్కారు లాక్‌డౌన్ విధింపు నిర్ణయం తీసుకుంది. భారత్ లో ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో టెస్ట్ పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నందున కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని విజయన్ చెప్పారు.

Kerala Govt announces complete lockdown

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News