Saturday, April 27, 2024

రాష్ట్రం కోరితే ఎయిమ్స్‌ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు ప్రయత్నిస్తాం: కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కోరితే రాష్ట్రంలోని ఎయిమ్స్‌ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపేథ్యంలో వైరస్‌ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం కావాలన్న కేంద్రం నుంచి అందించడానికి సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌ను స్పీడప్ చేయాలని సూచించారు. కోవిడ్‌కు ప్రస్తుతం వ్యాక్సిన్ లేనందుకు ప్రజలు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం నగరంలోని గాంధీ ఆసుపత్రిని కిషన్‌రెడ్డి సందర్శించారు. అక్కడ కరోనా పాటిజివ్ వచ్చిన వ్యక్తులకు అందుతున్న వైద్యసేవలు, డాక్టర్లు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలపై ఆయన ఆరాతీశారు. అనంతరం డాక్టర్లతో ఆయన కరోనాపై చర్చించారు.

అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరోనాను సమర్దవంతంగా కేంద్రం అరికడుతున్నందునే మరణాల రేటు మనదేశంలో తక్కువగా ఉందన్నారు. అలాగే రాష్ట్రంలో కూడా మరణాలను రేటును తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు కరోనా టెస్టులు వేగవంతం చేయాలని సూచించారు. కంటైన్మెంట్ జోన్ లో ప్రతిఒక్కరికి టెస్ట్ చేయాలని కేంద్రం సూచించిన విషయాన్ని ఈ సందర్భఁగా గుర్తు చేశారు. ప్రభుత్వానికి సహకరించాలన్న లక్షంతోనే నగరంలోని రైల్వే ఆసుపత్రి, ఇఎస్‌ఐ ఆసుపత్రులను కోవిడ్ కోసం వినియోగిస్తున్నామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడం వల్లే ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ దోపిడిని తక్షణమే ప్రభుత్వం అరికట్టాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులను వెళ్ళడానికి ప్రజలు జంకుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో వారిలో భరోసా నింపడానికి కరోనా సోకిన ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వ ఆసుపత్రిల్లోనే చికిత్స పొందాలని సూచించారు.

Kishan reddy enquire on Corona Treatment

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News