Wednesday, May 1, 2024

రాహుల్ గాంధీతో కోదండరాం భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టిజేఎస్ (తెలంగాణ జన సమి తి) చీఫ్ కోదండరాం శుక్రవారం కరీంనగర్ విపా ర్క్ హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌తో పనిచేయాలని ప్రొఫెసర్ కోదండరాం కు రాహుల్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పో టీ చేయాలని కోదండరాంను రాహుల్ కోరగా కో దండరాం పోటీకి ఆసక్తి చూపలేదని తెలిసింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ కోసం రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్ని కలవాలని కోరారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాష్ట్రం లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని టిజేఎస్ నిర్ణయించిందన్నారు. ఇక, పొత్తులో భాగంగా కాం గ్రెస్ వీక్‌గా ఉన్న అసెంబ్లీ స్థానాలను తమకు కేటాయించాలని కోదండరాం రాహుల్‌ను కోరినట్లు తెలిసింది. రాహుల్ తో జరిగిన భేటీలో పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.

జహీరాబాద్, కోరుట్ల, ఎల్లారెడ్డి, ముథోల్ టికెట్లను టిజేఎస్ ఆశిస్తోంది. కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘విజయ భేరి’ బస్సుయాత్రలో భాగంగా మూడోరో జు కరీంనగర్‌లో రాహుల్ గాంధీ బసచేసిన హో టల్ వద్ద కాంగ్రెస్ నేతలు అందోళనకు దిగడం క లకలం రేపింది. ‘సేవ్ కాంగ్రెస్, సేవ్ చెన్నూర్’ అంటూ ప్లకార్డులు పట్టుకొని చెన్నూర్ టికెట్ ఆశిస్తున్న నల్లాల ఓదెలు, రాజా రమేష్, నూకల రమే ష్ ఆందోళనకు దిగారు. చెన్నూర్ టికెట్ ను పొ త్తులో భాగంగా సిపిఐకి కేటాయించొద్దని ఈ సం దర్భంగా వారు కోరారు. రాహుల్ గాంధీ బస చే సిన హోటల్ వద్దకు ఒక్క సారిగా కాంగ్రెస్ శ్రేణులే ఆందోళనకు దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీ సంఖ్యలో చేరుకు ని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News