Monday, April 29, 2024

మరో మూడు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  మరో మూడు రోజుల్లో ఈశాన్య రుతుపనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం వెల్లడించింది. ఈ ఏడాదికి గాను నైరుతి రుతుపవనాలు దేశం నుంచి వెళ్లిపోయాయని , ప్రస్తుతం తూర్పు , ఈశాన్య దిశల నుండి దక్షిణ భారతదేశం మీదుగా గాలులు వీచే అవకాశం ఉండటంతో ఈశాన్య రుతుపవనాలు మూడు రోజుల్లో దక్షిణ భారతదేశంలోకి ప్రవేశిస్తాయని తెలిపింది.

ప్రస్తుతం అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని , బంగాళాఖాతంలో ఈనెల 21న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఈ రెండు అల్పపీడనాల కారణంగా ప్రారంభదశలో ఈశాన్య రుతుపవనాల తీవ్రత దక్షిణ భారతదేశంలో తగ్గుతుందని తెలిపింది. జాలర్లు 23వరకూ అరేబియా సముద్రం, దక్షిణ ,మధ్య అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వేళ్లవద్దని వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News