Saturday, April 27, 2024

ఇక్కడున్నది కెసిఆర్… మీ పప్పులుడకవ్

- Advertisement -
- Advertisement -

రెండ్రోజులు రాష్ట్రంలో బిజెపి సర్కస్ ఉంది పచ్చి అబద్ధాలు చెప్పబోతున్నారు
ఇక్కడ తిరిగే ఆ పార్టీ నేతలకు రైతుబంధు, బీమా గురించి చెప్పండి..
ఇంటింటికీ నల్లా చూపించండి రేవంత్ అనే చిలుక ఇక్కడిదే.. పలుకులే
పరాయివి : టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్
వివిధ పార్టీల నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన కల్వకుర్తి నేతలు, కార్యకర్తలు

మోడీ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి

బాత్ కరోడ్‌మే.. కామ్ పకోడీమే

KTR comments on BJP

కెటిఆర్ లాంటి నాయకుడు నాయకత్వ స్థానంలో ఉంటే హైదరాబాద్ మరో సిలికాన్ వ్యాలీగా మారడాన్ని ఎవరూ ఆపలేరు. కెటిఆర్ వివిద్యాధికుడు, సమర్థుడు, యూనికార్న్ ఫౌండర్స్ కన్నా ఉన్నతమైన విజ్ఞానం ఉన్న మంత్రి.
– హర్‌సిమర్ బిర్ (హర్ష్) సింగ్,
ప్రిస్టిన్ సహ వ్యవస్థాపకుడు

మన తెలంగాణ/హైదరాబాద్:  ప్రధాని నరేంద్రమోడీ ‘బాత్ కరోడ్ మే.. కాం పకోడి మే’ అన్న చందంగా తయారైందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు విమర్శించారు. అధికారంలోకి రా వడం కోసం ఆయన ఎన్నో నరికిండు..ఇప్పుడు దేశ ప్రతిష్ట దెబ్బ తీస్తున్నాడని మండిపడ్డారు. విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని దేశాన్ని రప్పిస్తానని డాం బికాలు పలికిన మోడీ.. గురించి అడిగితే మా త్రం తెల్లమొహం వేస్తున్నారన్నారు. దానిపై మాట్లాడ డానికి ఆయనకు నోరు పెకలడం లేదని తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల మోడీ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం కూడా ఏమీలేదన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఏమీ ఇ వ్వని మోడీకి బైబై చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మన రాష్ట్రం సొమ్ముతో  కులుకుతూ… మొండి చేయి చూపు తున్న చిల్లర పార్టీ బిజెపి అని వ్యాఖ్యానించారు. అందువల్ల రాష్ట్రానికి వచ్చే బిజెపి నేతలు…. ప్రజలకు సెల్యూట్ కొట్టి వెళ్ళాలన్నారు. తెలంగాణ భవన్‌లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల నుంచి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కెటిఆర్ సమయంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పారు. పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. అనంతరం వారిని ఉద్దేశించి కెటిఆర్ మాట్లాడుతూ, రెండు రోజుల్లో నగరంలో బిజెపి సర్కస్ ఉందన్నారు. చెప్పేవన్నీ పచ్చి అబద్ధ్దాలు ఉండబోతున్నాయని పేర్కొన్నారు.

బొమ్మలు పెట్టి ఆగం చేస్తాం అని వస్తున్నారని విమర్శించారు. కానీ వారి పప్పులు తెలంగాణలో ఉడకవన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది…. కెసిఆర్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రధానితో పాటు వస్తున్న కేంద్ర ఆ పార్టీ అగ్రనేతలు వచ్చి హైదరాబాద్‌లో ‘ఇరానీ చాయ్ తాగండి.. తినండి’ తిరిగి ఢిల్లీకి వెళ్లిపోవాలన్నారు. అంతే తప్ప అబద్ధాల యూనివర్సిటీలో తయారైన నోట్‌లను చదవద్దని ఈ సందర్భంగా సూచించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని క్షేత్ర స్థాయికి వెళ్లి తెలుసుకోండి తప్ప ఎవరో చెప్పిన విషయాలను నమ్మి రాష్ట్ర ప్రజల్లో చులకన కావొద్దన్నారు. పైగా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో బిజెపి సిపాయి వస్తాడట.. రండి! సిపాయిలకు మన రాష్ట్రంలో అన్ని రంగాలకు అందిస్తున్న 24గంటల కరెంట్ చూపాలని కెటిఆర్ సూచించారు. అలాగే రైతుబంధు, రైతుబీమా గురించి చెప్పాలి. రైతు వేదికలు చూపించాలన్నారు. ఇంటింటి నల్లా చూపించాలి.. మరి బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా ఇంటిటి నల్లా పెట్టాలని నిలదీయాలన్నారు. మన పథకాలన్నీ గ్రామాలకు వచ్చే బిజెపి నేతలకు వివరించాలని సూచించారు. అయితే రాష్ట్రానికి అప్పుడప్పుడు టూరిస్టులు వస్తారు….. పోతారన్నారు. వారివి అన్ని చిల్లర మాటలుగా పరిగణించాలన్నారు.

ముఖ్యంగా నరేంద్రమోడీ రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పాలని బిజెపి నేతలను నిలదీయాలన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి మనం చెబుతుంటే బేజారు అవుతుందని ఎద్దేవా చేశారు. పైగా సిఎంను పట్టుకుని నియంత అని వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. నియంత అయితే వీరందరినీ జైల్ లో వేయకపోవునా? అని కెటిఆర్ ప్రశ్నించారు. ఇలాంటి ఊకదంపుడు మాటలను వారికంటే వంద రెట్లు ఎక్కువ మాట్లాడగలమన్నారు. కానీ అలాంటి చిల్లర అలవాటు టిఆర్‌ఎస్‌కు లేదన్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ అనే చిలుక మనదే కానీ.. పరాయిదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వాలని అడుగుతుండడం సిగ్గుచేటని విమర్శించారు. కల్వకుర్తిలో కాషాయ చారి అనే గొట్టంగాడు ఉన్నాడని, ఆయన పైసలు గుంజుడు తప్పా ఒక్క పని చేసిండా? అని ప్రశ్నించారు. ఆచారి పుట్టు పూర్వోత్తరాలు అన్ని తమకు తెలుసన్నారు. టిఆర్‌ఎస్ లేకపోతే బండి సంజయ్, రేవంత్ ఎవరో ప్రజలకు తెలిసేదా అని నిలదీశారు.
కొత్త..పాత కలిస్తేనే పార్టీకి బలం
కొత్త నీరు, నీరు కలిసి పనిచేస్తేనే పార్టీకి బలమని కెటిఆర్ అన్నారు. కల్వకుర్తిలో 38వేల ఎకరాలకు నీళ్లు ఇప్పించే బాధ్యత తనదేనని మంత్రి కెటిఆర్ అన్నారు. త్వరలోనే అర్హులందరికీ వారికి కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.58వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు. టిఆర్‌ఎస్ అంటే తిరుగు లేని రాజకీయ శక్తి అని వ్యాఖ్యానించారు. ప్రజల్లో కెసిఆర్‌కున్న సంబంధం చూసి కాంగ్రెస్, బిజెపిలకు వణుకు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News