Wednesday, May 1, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ అభ్యర్థులకు కెటిఆర్ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

Minister KTR Sensational Comments At Kamareddy Tour

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న ప్రతి ఎన్నికలోనూ టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తూ వస్తుందని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల సాకారం కోసం సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెరాస ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పాలనకు, ప్రజలు ప్రతి ఎన్నికలలోనూ పట్టం కడుతున్నారన్నారు. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ 12 స్థానాలకు 12 స్థానాలను టిఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం ద్వారా టిఆర్ఎస్ పార్టీ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైంది అన్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అనేక వినూత్న కార్యక్రమాలతో స్థానిక సంస్థలు ఎంతగానో బలోపేతమయ్యాయని అన్నారు.

ముఖ్యంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా స్థానిక సంస్థలకు ప్రతి నెల టంచన్ గా నిధులను అందిస్తూ స్థానిక సంస్థలను ఆర్థికంగానూ బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి కార్యక్రమాల ఫలితంగానే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఘనమైన విజయం అందించారన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులు అందరికీ కెటిఆర్ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన స్థానిక సంస్థల ప్రతినిధులు అందరికీ మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

KTR Congratulates to TRS MLC Winners

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News