Friday, May 3, 2024

‘స్థానిక’ పురస్కారాలపై కెటిఆర్ హర్షం

- Advertisement -
- Advertisement -

 మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శులకు సన్మానం
 రాష్ట్రానికి అవార్డులు తెస్తున్నందుకు శుభాకాంక్షలు
 మరింత ఉత్సాహంగా పనిచేయాలని అభినందనలు

మన తెలంగాణ/హైదరాబాద్: దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరణ్ పురస్కార్ కింద దేశంలో అత్యుత్తమ స్థానిక సంస్థలుగా 12 పురస్కారాలు రాష్ట్రానికి రావడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖల మంత్రి కెటిఆర్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకి శుభాకాంక్షలు తెలిపి, సత్కరించారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్‌రావులని సన్మానించి, అభినందించారు. ప్రగతిభవన్‌లో గురువారం మంత్రులిద్దరూ కలుసుకున్న సందర్భంగా కెటిఆర్.. ఎర్రబెల్లితో కొద్దిసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా పని చేస్తూ, దేశంలోనే అత్యుత్తమ గ్రామ పంచాయతీలు 9, మండలాలు 2, జిల్లా పరిషత్ ఒకటి చొప్పున అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

గతంతో సహా వరసగా అవార్డులు వస్తుండటం పట్ల మంత్రి కెటిఆర్ అభినందించారు. అలాగే రాష్ట్రానికి అవార్డులు వచ్చే విధంగా పనిచేస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది ప్రతి ఒక్కరినీ కెటిఆర్ అభినందించారు. సిఎం కెసిఆర్ వినూత్నంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుందన్నారు. ప్రతి నెలా ఇస్తున్న 308 కోట్లు గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్నాయన్నారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అసలైన గ్రామ స్వరాజ్య స్థాపన సిఎం కెసిఆర్ హయాంలో జరుగుతున్నదన్నారు. ఇప్పుడు గ్రామాల్లో ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు వచ్చాయనీ, నర్సరీలు, డంపుయార్డులు, పల్లె ప్రకృతివనాలు, స్మశానవాటికలు ఏర్పడ్డాయని, నిత్యం పారిశుద్ధం జరుగుతుండటంతో గ్రామాలు అద్దాల వలె తయారయ్యాయని మంత్రి చెప్పారు. ఇప్పుడు గ్రామాల్లో కరోనా వ్యాప్తి తగ్గడమే గాక, అంటు, సీజనల్ వ్యాధుల జాడ లేకుండా పోయిందని చెప్పారు. ఇదే తరహా పనితీరుని కొనసాగిస్తూ, రాష్ట్రానికి మరింత పేరు తెచ్చే విధంగా పనిచేయాలని మంత్రి కెటిఆర్ సూచించారు.

KTR felicitates Minister Errabelli Dayakar Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News