Saturday, April 27, 2024

తెలంగాణలో ఉన్నన్ని గురుకులాలు ఏ రాష్ట్రంలో లేవు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూల్: జిల్లాలోని తిమ్మాజీపేటలో ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ హై స్కూల్ ను రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సబితా రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, ఎంపీ రాములు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ”ఎంత కాలం బతికాను అన్న దానికన్నా.. ఎంత గొప్ప పనులు చేశామో గుర్తుండి పోతుంది. మర్రి జనార్దన్ రెడ్డి తాను పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు పాఠశాలలను నిర్మిస్తున్నట్లు చెప్పడం తన గొప్పతనం. ఇది కార్పొరేట్ పాఠశాల కన్నా గొప్పగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఇపుడు ఉన్నత స్థానాల్లో ఉన్న వారు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యా శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.. ఎవరైనా తమ వారి పేరున పాఠశాలకు విరాళాలు ఇవ్వాలి. ఒకప్పుడు పాలమూరు నుంచి వలస వెళ్ళేవారు.. ఇపుడు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వస్తున్నారు. తెలంగాణాలో ఉన్నన్ని గురుకుల పాఠశాలలు ఏ రాష్ట్రంలో కూడా లేవు. ఈ ఎడేళ్ళలో ఫీస్ రీఅంబర్స్ మెంట్ పదహారు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం. దేశంలో నూటా యాభై మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు.. మనకు సున్నా. ఎనిమిది ఐఐఎంలు దేశంలో పెడితె.. మనకు సున్నా. వందకు పైగా నవోదయ పాఠశాలల్లో మనకు సున్నా. రేపు సమతా మూర్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అవిష్కరిస్తారు. ఈరోజు పిఎంకు కలలోకి వెళ్లి.. తెలంగాణను కూడా సమ దృష్టి తో చూడాలని, మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని.. కర్నాటక, మహరాష్ట్రలతో సమానంగా మన తెలంగాణను చూడాలని నేను ఆ రామానుజచార్యుల వారిని కోరుకుంటా ”అని అన్నారు.

KTR Inaugurates Govt School in Thimmajipeta

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News