Friday, April 26, 2024

హరితహారంలో మొక్కలు నాటిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 KTR participating in Haritha Haram program in Dundigal

హైదరాబాద్: భవిష్యత్ తరాలకు మంచి పట్టణాలను అందించేందుకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. హైదరాబాద్ లో ఆరోవిడుత హతరిహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్ దుండిగల్ లో మొక్కలు నాటారు. కెటిఆర్ తో పాటు కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

సనత్ నగర్, బల్కంపేట్ లో మంత్రి కెటిఆర్ హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు హరితహరంలో బాగస్వామ్యం కావాలిన మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. నాటిన మొక్కలను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. “ఈచ్‌ వన్‌ ప్లాంట్‌ వన్” అనే నినాదంతో ప్రతొక్కరు మొక్కలు నాటాలని  కెటిఆర్ పిలుపునిచ్చారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని బోయిగూడలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన పార్కును ఆయన ప్రారంభించారు. ఈ ఏడాది హరితహారంలో భాగంగా హెచ్‌ఎండిఎ పరిధిలో 12.5 కోట్ల మొక్కలు నాటనున్నామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

KTR participating in Haritha Haram program in Dundigal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News