Monday, May 6, 2024

తెలంగాణలో మరో ఆరు విమానాశ్రయాలు ఏర్పాటు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ‘ఫ్లైయింగ్ ఫర్ అల్’ అనే నినాదంతో జరిగే వింగ్స్ ఇండియా 2020 కార్యక్రమ స్పూర్తి మేరకు ఎయిరో స్పేస్ రంగం మరింత అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని ఐటి శాఖమంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఉన్న అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ అత్యుత్తమ ప్రమాణాలతో అభివృద్ది చెందుతున్నదని, ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. హైదరాబాద్ తో పాటుగా చుట్టుపక్కల ఉన్న నగరాలు, పట్టణాలులో సాఫ్ట్ వేర్ పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అక్కడ పరిశ్రమలు డెవలప్ కావాలంటే విమానాశ్రయాలు ఉండాల్సిన అవసరం ఉందని కెటిఆర్ పేర్కొన్నారు. అందుకే తెలంగాణలోని ఆరు ముఖ్యమైన ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, జక్రాన్ పల్లి, పెద్దపల్లి, మహబూబ్ నగర్(అద్దకల్)లల్లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.

 KTR Says Set up Another Six Airports in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News