Saturday, April 27, 2024

టెక్ మహీంద్రాకు ధన్యవాదాలు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

తెలంగాణ: వరంగల్‌లో ఐటి క్యాంపస్ ఏర్పాటు చేసిన టెక్ మహీంద్రాకు ధన్యవాదాలు అని మంత్రి కెటిఆర్ తెలిపారు. టెక్ మహీంద్రా, సైయెంట్ క్యాంపస్‌లను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. తెలంగాణలో అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటి రంగాన్ని విస్తరిస్తామన్నారు. కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం నల్లగొండలలో ఈ ఏడాదే ఐటి పార్క్‌లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతామని, అనేక వనరులున్న వరంగల్‌లో సేవలు అందించాలని టెక్ మహీంద్రా కంపెనీని కోరామని, అడిగిన వెంటనే వరంగల్‌లో ఐటి పార్క్ ఏర్పాటు చేయడానికి మోహన్ రెడ్డి, గుర్నాని ముందుకొచ్చారన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా యాదాద్రి వర్థిల్లుతుందని పేర్కొన్నారు. వరంగల్ యువత ప్రతిభను చూసి ఐటిని మరింత విస్తరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వరంగల్‌లో తాము ఊహించినదానికంటే వేగంగా ఐటి విస్తరిస్తుందని కెటిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జౌళి పార్కును వరంగల్‌లోనే ఏర్పాటు చేశామని, జౌళి పార్కుకు అతి త్వరలో పూర్తి స్థాయి పనులు ప్రారంభిస్తామన్నారు. టెక్ మహీంద్రా సిఇఒ, ఎండి గుర్నాని, సైయెంట్ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి, మంత్రి కెటిఆర్‌తో కలిసి క్యాంపస్‌ను పరిశీలించారు. రూ 25. కోట్ల వ్యయంతో భారీ క్యాంపస్ సైయెంట్ నిర్మించింది. ఇప్పటికే సైయెంట్ ఇంక్యుబేషన్ సెంటర్‌లో 100 మంది ఉద్యోగులు పని చేస్తుండగా మరో 900 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.

 

KTR says thanks to Tech Mahindra for WGL IT Park
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News