Friday, May 10, 2024

ఎల్‌బినగర్ సర్కిల్‌లో.. మరో ఫ్లైఓవర్

- Advertisement -
- Advertisement -

రెడీ అయిన ఎస్‌ఆర్‌డిపి ప్యాకేజీ-2 కింద ఎల్‌బినగర్ జోన్ బైరామల్ గూడ ఫ్లైఓవర్
నేడు ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ వాసుల ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఎస్‌ఆర్‌డిపి ప్యాకెజీ2 కింద ఎల్‌బినగర్ జోన్‌లో చేపట్టిన మరో ప్రాజెక్టు నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఎల్‌బినగర్ భైరామల్‌గూడ జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్ల్లైఓవర్‌ను సోమవారం ఉదయం 11 గంటలకు పురపాలక శాఖమంత్రి కె. తారకరామారావు ప్రారంభించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. రూ.26.45 కోట్ల అంచనా వ్యయంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రత్యేక టెక్నాలజీని వినియోగించిన నిర్మించిన ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుండడంతో సికింద్రాబాద్ నుంచి ఎల్‌బినగర్ మీదగా శ్రీశైలం వైపు వెళ్లే ప్రయాణికులకు 95 శాతం ట్రాఫిక్ సమస్య తీరనుంది. అదేవిధంగా సాగర్ రోడ్ ప్రయాణికులకు సైతం 45 శాతం ట్రాఫిక్ జామ్ నుంచి విముక్తి లభించనుంది. బైరామల్ గూడ జంక్షన్ వద్ద నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ పొడవు 780 మీటర్లు కాగా, వెడల్పు 12 మీటర్లు. ఇందులో 11 మీటర్ల మేర 3 లైన్లలో వన్‌వేగా ఏర్పాటు చేశారు. మెట్రో రైలు అందుబాటులోకి రానప్పుడు 2015 నాటికి గంటకు 11,875 వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుండగా, మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత గంటలకు 7481కి తగ్గింది. ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా పెరగా 2034 నాటికి ఈ సంఖ్య 18,653 పెరగనుందన్న అంచనాల ప్రకారం ఈ ఫ్లై్లైఓవర్ నిర్మాణం చేశారు.

ప్యాకేజీ2లో రూ. 448 కోట్ల అంచనా వ్యయంతో 14 ప్రాజెక్టులు నిర్మాణం
ఎల్‌బినగర్ జోన్‌లో ఎస్‌ఆర్‌డిపి2 ప్యాకేజీ కింద రూ.448 కోట్ల అంచనా వ్యయంతో 14 ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో నిర్మాణ పనుల కాంట్రాక్టు విలువ రూ. 341.41 కోట్లు కాగా, మిగిలిన ఇతర సౌకర్యాల కల్పనతోపాటు భూసేకరణ తదితరాలకు కేటాయించారు. ఈ 14 ప్రాజెక్టులో ఇప్పటికే 5 నిర్మాణ పనులు (1) ఎల్‌బినగర్ జంక్షన్ వద్ద ఎడమవైపు ఫ్లై ఓవర్ రూ. 24.744కోట్లు, (2) అండర్ పాస్ రూ.8.539 కోట్లు, (3) కామినేని జంక్షన్ వద్ద కుడివైపు ఫ్లై్లైఓవర్ రూ.23.202 కోట్లు, (4) కామినేని జంక్షన్ వద్ద ఎడమ వైపు ఫ్లైఓవర్ రూ.23.202 కోట్లు, (5) చింతల్ కుంట వద్ద అండర్ పాస్ రూ.13.258 కోట్లు నిర్మించిన ఈ 5 ప్రాజెక్టులు పూర్తి కావడమే కాకుండా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. రూ. 26.45 కోట్ల వ్వయంతో నిర్మించిన భైరామల్ గూడ ప్లైఓవర్ నేడు ప్రారంభం కానుంది.

KTR to begins LB Nagar Circle flyover on Monday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News