Monday, April 29, 2024

ఆడిటింగ్‌లోనూ ఆదర్శం

- Advertisement -
- Advertisement -

 ఆన్‌లైన్ ఆడిటింగ్‌లో దేశానికే మార్గదర్శిగా తెలంగాణ
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అభినందన
13న అన్ని రాష్ట్రాల ఆడిట్ శాఖాధిపతులతో కాన్ఫరెన్స్

మన తెలంగాణ/హైదరాబాద్: మరోమారు తెలంగాణ రాష్ట్రం దేశానికి మార్గదర్శిగా నిలిచింది. గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న ఆన్‌లైన్ ఆడిటింగ్‌లో దూసుకపోతున్నది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రక్రియను చూసి కేంద్రం పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర పంచాయితీరాజ్ శాఖ తెలంగాణను ప్రత్యేకంగా అభినందించింది. ఈ ఆన్‌లైన్ ఆడిటింగ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం ఈ నెల 13న అన్ని రాష్ట్రాల ఆటిట్ శాఖాధిపతులతో వీడియా కాన్ఫ్‌రెన్స్ నిర్వహించాలని తలపెట్టింది. దేశంలోని అన్ని గ్రామ పంచాయితీలకు కేంద్రం నేరుగా నిధులను మంజూరు చేస్తోంది. అయితే ఈ నిధులను గ్రా పంచాయితీలు ఏ విధంగా ఖర్చు చేస్తున్నాయి? ఏ ఏ అంశాలకు ప్రాధాన్యతను ఇస్తున్నాయి? నిధులను ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటున్నాయి? తదితర విషయాలను తెలుసుకునేందుకుగానూ కేంద్రం ఆన్‌లైన్ ఆడిటింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా దేశంలో సుమారు 2.5లక్షల గ్రామ పంచాయతీలు ఉండగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2020…2021)లో 20 శాతం మేరకు (సుమారు 50వేల గ్రామాలు) ఆన్‌లైన్ ఆడిట్ చేయాలని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయ తీసుకుంది. ఈ సమాచారాన్ని కేంద్రం అన్ని రాష్ట్రాలకు తెలియజేసింది.

కేంద్రం విడుదల చేసిన ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లను ఈ పంచాయతీలు ఏ విధంగా ఉపయోగించాయి? అనే విషయంపై ఫోకస్ పెట్టి గత ఆర్ధిక సంవత్సరం ( 2019…20-20) చిట్టాలను, బుక్స్‌ను తనిఖీ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ఈ నెల 3వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఆడిటింగ్ ప్రారంభమైంది. అయితే తెలంగాణ రాష్ట్రం మినహా మిగిలిన రాష్ట్రాలు ఆ ప్రక్రియను అసలు మొదలుపెట్టలేదు. మిగిలిన రాష్ట్రాలు ఇంకా ఈ దిశలో దృష్టిసారించకపోవడంతో కేంద్రం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. 15 వ ఆర్థిక సంఘం ప్రతిపాదించిన నిధులు సదరు గ్రామపంచాయితీ అకౌంట్లలో జమ చేయాలంటే ఆయా రాష్ట్రాల్లో కనీసం 20 శాతం గ్రామపంచాయతీల్లో ఆన్లైన్ ఆడిటింగ్ తప్పనిసరి అని నిబంధన విధించింది.
కాగా కేంద్రం ఆదేశించిన విధంగా తెలంగాణ రాష్ట్రం ఆన్‌లైన్ ఆడిటింగ్‌‌ను ప్రారంభించింది. రాష్ట్రంలో 542 మండలాలు, 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా, 3,830 గ్రామ పంచాయతీలలో తొలివిడతగా ఆన్‌లైన్ ఆడిటింగ్‌ను మొదలుపెట్టింది. దీని కోసం ప్రత్యేకంగా 350 మంది ఆడిటింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చింది. రానున్న అక్టోబర్ 31న ఆన్‌లైన్ ఆడిటింగ్ మొదటి దశను ప్రక్రియను పూర్తి చేయాలన్న లక్షంతో ఆన్‌లైన్ ఆడిటింగ్‌ను నిర్వహిస్తోంది. గ్రామపంచాయితీల్లో జమ ఖర్చులు ఆడిట్ చేసి ఆ నివేదికలను ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు. రాష్ట్రంలో మరింత పారదర్శకతకు ఆడిట్ శాఖ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వరరావు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆన్‌లైన్ ఆడిటింగ్‌పై ఆయన రోజువారీ సనీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.

Central praised to Telangana in online auditing

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News