Friday, April 26, 2024

రాజేంద్రనగర్‌లో పులిజాడలు

- Advertisement -
- Advertisement -

Tiger Wandering Near Aswaraopeta Mandal

మనతెలంగాణ/హైదరాబాద్: రాజేంద్ర నగర్‌లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న చిరుతను పట్టుకునేందుకు జిల్లా అటవీ అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. రాజేంద్రనగర్ వాలంతరి సమీపంలోని ఫాతీమా ఫామ్ హౌజ్ పశువుల కొట్టంలో చిరుతను పసిగట్టేందుకు 20 ట్రాప్ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. చిరుత సంచారం కెమెరాలో రికార్డ్ కావడంతో మూడు బోన్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆవుపై దాడి చేసింది చిరుతే అని నిర్ధారించారు. మూడు నెలల క్రితం రెండు ఆవులను చిరుత చంపగా అదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన చిరుతను అధికారుల జూకు తరలించిన విషయం తెలిసిందే.

Leopard caught on CCTV Camera in Rajendra Nagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News