Sunday, April 28, 2024

చింతమడక నుంచి సిఎం దాకా…

- Advertisement -
- Advertisement -

 

మొన్నామధ్య ప్రత్యూషకు ప్ళ్ళైంది. సిఎం కెసిఆర్ దంపతులు అంగరంగ వైభవంగా ఆమె పెళ్ళి జరిపించారు. కట్న కానుకలు సమర్పించారు. కానీ ఆమేమీ కెసిఆర్ కన్నబిడ్డ కాదు. 2015లో గృహ హింసకు గురైన ప్రత్యూషని ఇంటికి రప్పించుకుని అన్నం పెట్టి ఆదరించి, రూ. 5లక్షలిచ్చి దత్తత తీసుకున్న కెసిఆర్, ఆమెను చదివించి, ఉద్యోగం ఇప్పించారు. ఇది చలించి, స్పందించిన గుణానికి సంకేతం. అయితే, కెసిఆర్ అంతటితోనే ఆగిపోలేదు. పెళ్ళి కూడా చేసేశారు. ఓ తండ్రిలా బాధ్యతగా నిలబడ్డారు. ఇది కెసిఆర్ మానవత్వానికి ఓ మచ్చుతునక. ఇక కవులు, కళాకారులు, ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, తన సిబ్బంది, అధికారులు, నాటి ఉద్యమ ఉధృతికి పాటుపడిన వాళ్ళు అనేక మందికి ఇలా పెళ్ళిళ్ళు చేయడమో లేక ఆర్థిక సాయం చేయడమో చేస్తూనే ఉన్నారు. నాడు తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం మైలారంలో ఆగిన అప్పటి ఉమ్మడి రాష్ట్ర సిఎం చంద్రబాబుని తెలంగాణకు మద్దతు తెలపండి అని, సంచలనమైన ఫణికర మల్లయ్య ఇద్దరు బిడ్డల పెళ్ళిళ్ళను కూడా కెసిఆరే చేశారు.

ఇలా ఇచ్చిన చేయూతలకు, చేసిన ఆర్థిక సాయాలకు లెక్కలేదు. అమ్మ లాగా ఇవ్వడమే అలవాటైన కెసిఆర్ హృదయం నది లాంటిది. మనసు సముద్రమంత. చంద్రశేఖర్ రావు చింతమడకలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. కెసిఆర్ కుటుంబం ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో భూమి కోల్పోయి చింతమడక గ్రామంలో స్థిరపడింది. చిన్నతనంలో మధ్యతరగతి జీవితం అనుభవించారు. సిద్దిపేట డిగ్రీ కాలేజీలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బి.ఎ. పూర్తిచేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ (తెలుగు సాహిత్యం) చదివారు. 1969 ఏప్రిల్ 23న శోభను వివాహమాడారు. సాహిత్యం మీద మక్కువతో బిడ్డకు కవిత అనీ, ఎన్టీఆర్ మీద అభిమానంతో కల్వకుంట్ల తారక రామారావు అని పేరు పెట్టారు. కెసిఆర్ చదువు పూర్తవుతుండగానే ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తానని అతని రాజకీయ గురువు మదన్ మోహన్ సూచిస్తే ‘నేను ఉద్యోగం చేయను, రాజకీయాల్లోకి వస్తాను’ అన్నారు.

ఇది కెసిఆర్ దృఢ సంకల్పానికి నిదర్శనం. విద్యార్థి దశ నుండే రాజకీయాలపై మక్కువతో ఢిల్లీ నుంచైతేనే ఏదైనా చేయొచ్చని భావించి, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ రెండో కొడుకు సంజయ్ గాంధీతో జతకట్టారు. విమాన ప్రమాదంలో సంజయ్ మరణంతో మళ్ళీ చింతమడకకు చేరారు. అప్పట్లో సభల్లో కెసిఆర్ మాట్లాడితే జనం ఎగబడి వినేవారు. ఆనాడే ఉపన్యాసకళని పిడికిట పట్టారు. అప్పటి ఉమ్మడి రాష్ట్ర సిఎం చెన్నారెడ్డి కూడా ఓ సభలో కెసిఆర్ ప్రసంగం విని, ఆ కుర్రాడిని బాగా ప్రోత్సహించమని చెప్పారు. ఎన్టీఆర్‌కు వీరాభిమాని కావడంతో యువజన కాంగ్రెస్‌ను వీడి 1982లో తెలుగుదేశంలో చేరారు. మొదటిసారి తన గురువు మీదే పోటీ చేసి 877 ఓట్లతో ఓడి, 1985లో జరిగిన ఎన్నికల్లో అదే గురువు మీద గెలిచారు. ఇక అప్పటి నుంచి ఆయన వెను తిరిగింది లేదు. 14 ఏండ్ల ఉద్యమ పాఠాల నుంచి, 40 ఏండ్ల రాజకీయం నేర్పిన అనుభవం నుంచి, సామాజిక బాధ్యతతో,దూరదృష్టితో మానవీయతను జోడించి తీసుకున్నవే. అందుకే అనేకానేక నిర్ణయాలను ప్రపంచమే హర్షిస్తున్నది. దేశమే కెసిఆర్ నిర్ణయాలను అమలుపరుస్తున్నది.

కెసిఆర్ ప్రవేశ పెట్టిన పథకాలన్నీ, తెలంగాణ ఆత్మగౌరవం, మానవీయ కోణం ఉట్టిపడేలా ఉంటాయి. అప్పుడే ఆవిర్భవించిన తెలంగాణలో ఉన్నదేంది? లేనిదేందో తెలుసుకోవడానికి చరిత్రాత్మకంగా సకల జనుల సర్వే, ఒక్కో ఊరి సమగ్రాభివృద్ధికి ఏమేం కావాలో తెలిపే మన ఊరు -ప్రణాళిక. దీనికి కొనసాగింపుగా, గ్రామ పంచాయతీల్లో పాదర్శకత, జవాబుదారీతనం పెంచే విధంగా గ్రామజ్యోతి. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, వెల్లివిరిసే విధంగా వార్షిక, పంచవర్ష ప్రణాళికలతో పని చేసే, పల్లె ప్రగతి. పల్లె ప్రగతి లాగే పట్టణ ప్రగతి. కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ, వాటిని వినియోగించే అలవాటు చేయడానికి మన ఊరు -మన కూరగాయలు. భావి భారత పౌరులని తీర్చిదిద్దే కెజి టు పిజి ఉచిత విద్య. గర్భిణీలకు ఆరోగ్య లక్ష్మీ, పేదల ఇండ్లల్లో పెండ్లళ్ళకు సాయం ఆర్థిక చేసే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్. నిండు గర్భిణీలను 102 నెంబర్ వాహనం ద్వారా దవాఖానలకు ఉచితంగా తీసుకుపోయే అమ్మఒడి.

ప్రభుత్వ స్కూళ్ళ ఆడపిల్లలకు అవసరమైన అత్యవసర వస్తువుల ఉచిత కిట్ బాలికా ఆరోగ్య సంరక్ష. ఉచితంగా కంటిపరీక్షలు, చికిత్సలు, శస్త్ర చికిత్సలు అందించే కంటి వెలుగు. బస్తీల్లోని నిరుపేదలకు సుస్తీ చేస్తే ఆదుకునే బస్తీ దవాఖానాలు. గల్లీల్లోని వాళ్ళకి ఎమర్జెన్సీ వైద్యం అందించడానికి బైక్ అంబులెన్స్‌లు. మనుషులకే కాదు, పశువులకూ సంచార పశు వైద్యశాలలు. బతుక్కి ఆసరాగా నిలిచే విధంగా వృద్ధులు, వికలాంగులు, కల్లుగీత, చేనేత కార్మికులు, హెచ్‌ఐవి, పైలేరియా వ్యాధిగ్రస్థులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు నెలనెలా ఆసరా పెన్షన్లు, అగ్గిపెట్టెల్లో పట్టే చీరలు నేసే నేతన్నకు చేయూత, అన్నదాతలకు రైతు బంధు, రైతు బీమా, రైతు బంధు సమితి, కల్లాలు, రైతు వేదికలు. సమస్త భూ రికార్డుల ప్రక్షాళనకు ధరణీ. జలమే జీవం, జీవానికి జలం… ఉద్యమంలా జలం-జీవం. హాస్టళ్ళల్లో ఉండే పిల్లలకు కెసిఆర్ మనవడు ఏవి తింటున్నాడో అవే సన్న బియ్యం. హైదరాబాద్ ఐకాన్ లవ్ హైదరాబాద్.

ఊరూరా సిసి కెమెరాల-నేను సైతం, మిషన్ ఉమెన్ ప్రొటెక్షన్, మహిళల భద్రతకు షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, ఔత్సాహిక ఐటి దిగ్గజాల కోసం టిఎస్ ప్రైడ్, టి హబ్, పచ్చనైన, శుభ్రమైన స్వచ్ఛ హైదరాబాద్. దేవాలయాలకు ధూప దీప నైవేద్యం. ఊరూరా తడి, పొడి చెత్తలను వేరుచేసే, డంపింగ్ యార్డులు, మొక్కల బ్యాంకులు నర్సరీలు, పర్యావరణ హితంగా పల్లె ప్రకృతి వనాలు, ఎవరైనా సర్కార్ దవాఖానాల్లో చనిపోతే, వారి ఊరిలో ఆ డెడ్ బాడీలను దింపి, ఆ కుటుంబాలకు నయా పైసా ఖర్చు లేకుండా అప్పగించే పరమపద వాహనాలు, పల్లెల్లో పరమపదించిన వాళ్ళ అంతిమ సంస్కారాల కోసం వైకుంఠ ధామాలు. పథకాల పేర్లే కాదు… ఇలా అనేకానేక పథకాల లక్ష్యాలన్నీ మానవీయమే. ప్రాజెక్టులకు సైతం జనాలకు బాగా కనెక్ట్ అయ్యే పేర్లే పెట్టారు. కాళేశ్వరం, సీతారామ, భక్తరామదాసు, పాలమూరు రంగారెడ్డి, శ్రీరాం సాగర్ పునరుజ్జీవ ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరిత హారం, ఇవేకాదు, మనిషి గుండెను తాకి, తడి చేసే కార్యక్రమాలు కూడా ఎన్నో ఉన్నాయి.

ఆరోగ్యశ్రీలో అవయవ మార్పిడులు, అత్యవసర సేవలకు ఐసియులు, రోజురోజుకు పెరుగుతున్న కిడ్నీ బాధితులకు డయాలిసిస్ కేంద్రాలు, స్క్రీనింగ్, టెస్టుల కోసం కేన్సర్ కేర్ నెట్ వర్క్-టాటా ట్రస్టుతో ఒప్పందం, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్‌కి, దీర్ఘ కాలిక రోగాలకు ఉచితంగా లైఫ్ టైమ్ మందులు, నాటుసారా నిషేధం- పునరావాసం, పేకాట క్లబ్బుల మూసివేత, గణేశ్ నిమజ్జన కొలనులు, ఆలయాలు, మసీదులు, చర్చీల పునరుద్ధరణలు, అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు. ఇక, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త గ్రామ పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు, సమీకృత జిల్లా కలెక్టరేట్లు, పోలీస్ కమిషనరేట్లు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఏర్పాటు, సమగ్ర పౌర సమాచార నిధి, కొత్త భూసేకరణ చట్టం, కొత్త పంచాయతీరాజ్ చట్టం, రూపాయికే నల్లా కనెక్షన్, పరిశ్రమలు, ఐటి పాలసీల సంస్కరరణలెన్నో, ఇంకెన్నో. ప్రపంచ బయో ఏషియా సదస్సు హైదరాబాద్‌కి అంతర్జాతీయ ఖ్యాతిని తెస్తే, ప్రపంచ తెలుగు మహా సభలు మన భాషా, సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని, వైశిష్ట్యాన్ని దశదిశలా చాటాయి.

అలాగే, ఉద్యమం నాటి రైల్ రోకో కేసులు ఇంకా వేధిస్తుంటే, రాష్ట్రంలో ఉద్యమకారులపై కేసులను ఎత్తి వేశారు. అమరులకు నివాళిగా మహా దీపకళిక నిర్మాణం చేపట్టారు. మిషన్ కాకతీయను మేనిఫెస్టోలో ప్రకటించలేదు. మిషన్ భగీరథ ఎవ్వరూ అడగలేదు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, ఆసరా ఫించన్లు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులు, గీత, చేనేతకు చేయూత, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, కంటివెలుగు, ఆరోగ్యలక్ష్మి, ఆపరేషన్ స్త్మ్రల్, షీ టీంలు, కార్డాన్ సెర్చ్ తో దొంగలకు, సీసీ టీవీలతో నేరగాళ్లకు చెక్, నూతన పారిశ్రామిక విధానం, నూతన పంచాయతీ, మున్సిపల్ చట్టాలు, సన్నబియ్యం, గురుకులాలు, బాలికలకు హెల్త్ కిట్స్, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, హరితహారం, టి హబ్, వి హబ్, మార్కెట్ పాలకమండళ్లలో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళా కోటా పెంపు, ఇండ్లకు 24 గంటలు, రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు, పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు. ఒకటా, రెండా ఇలా వందల కొత్త నిర్ణయాలు, కొంగొత్త పథకాలు.

కుల వృత్తుల పూర్వ వైభవానికి గొర్లు, బర్లు, చేపల పంపిణీ, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటు, ధూపదీప నైవేద్యాలు, అర్చకులు, ఆశా, అంగన్ వాడీ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా అనేకానేకుల జీతాల పెంపు, జర్నలిస్టులు, న్యాయవాదుల సంక్షేమానికి నిధి, భవన నిర్మాణ కార్మికులకు ఎక్స్‌గ్రేషియా ఎవరికీ తట్టని పథకాలు. సకల జనుల సర్వేతో తెలంగాణలో ఉన్నదేంటి కావాల్సిందేంటో కెసిఆర్ తేల్చేశారు. సుదీర్ఘ మేధో మథనంతో పథకాలు ప్రవేశపెట్టారు. ఆసరా పెన్షన్లు ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని,కుటుంబ సంబంధాలను గట్టిపరిచాయి. అత్తాకోడళ్ళు తల్లీ బిడ్డల్లా కలిసి ఉండేలా చేశాయి. లాక్‌డౌన్‌లో పట్టణాల నుంచి పల్లెబాట పట్టిన కుటుంబాలను ఆసరా పెన్షన్ల అమ్మమ్మ, నానమ్మలే సాదుకున్నరు. ఇంతెందుకు? అంటరానివారిగా మిగిలిన ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితుల గురించి అంతకుముందు ఆలోచించిందెవరు?! అమరుల కుటుంబాలకు రూ.10లక్షలు, ఓ ఉద్యోగం. ఉద్యమ కళాకారులకు సాంస్కృతిక సారథి, వడదెబ్బ మృతులకు ఆపద్బంధు, పిడుగుపాటు మృతులకు రూ.6లక్షలు, ప్రకృతి వైపరీత్యాల మృతులకు రూ.5లక్షలు, గుడుంబా నిర్మూలన-పునరావాసాలు సహా, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతో పేదింట పెండ్లిళ్ళకు కెసిఆరే పెద్దదిక్కయ్యారు.

ప్రజల పండుగలను ప్రభుత్వమే నిర్వహించడం దేశంలో ఎక్కడా లేదు. గంగా జమునా తహజీబ్ ని తలపిస్తూ, ప్రజల సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ, ప్రభుత్వమే బట్టలు పెట్టి, బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నది. అంతేకాదు యాదాద్రి, క్రిస్టియన్ భవన్, ఆజ్మీర్‌లో రుబాత్ వంటి దేవాలయ, భవనాలు సర్వమతాలను గౌరవించుకోవడమే కాదు, ధూపదీప నైవేద్యాలకు అర్చకులకు, ఇమామ్, మౌజమ్, ఫాదర్లకు భృతి కల్పించారు. ఇంటికి దీపం…కంటికి వెలుగుప్రభుత్వమే అమ్మలాగా గర్భిణీని సర్కారు దవాఖానాకు తీసుకెళ్ళే, అమ్మఒడి 102 వాహనం, తల్లీ బిడ్డలకు అవసరమైన 15 రకాల వస్తువులు, రూ.12వేలు, ఉచితంగా టీకాలు అందించే కెసిఆర్ కిట్స్ పథకం. 108కి అదనంగా, గల్లీల్లోని అత్యవసర చికిత్సార్థులకు బైక్ అంబులెన్స్‌లు. ఆరోగ్య లక్ష్మీ, ఆశా అంగన్వాడీ టీచర్ల జీతాల పెంపు, బాలికా ఆరోగ్య పథకం కింద విద్యార్థినులకు హైజెనిక్ కిట్లు ఎవరైనా ఇచ్చారా? తెలంగాణ వచ్చి ఆరున్నరేళ్ళే గడిచింది. ఆరేళ్ళంటే శైశవమే. ఆరేళ్ళల్లో ఏమవుతుంది? మరి ఇప్పటి దాకా జరిగిందెంత? ఆకలిచావుల తెలంగాణ గడిచిన అయిదేళ్లలోనే అన్నపూర్ణగా నిలిచింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News