Saturday, April 27, 2024

పింఛన్‌దారుల జీవన ధ్రువ పత్రాల గడువు ఫిబ్రవరి 28 వరకు

- Advertisement -
- Advertisement -

Life Certificate For Pensioners Deadline is February 28th

న్యూఢిల్లీ: పింఛన్‌దారులు తమ జీవన ధ్రువీకరణ పత్రాలు సమర్పించే గడువును వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. కరోనా సమయంలో గుంపులుగా చేరకుండా నిరోధించేందుకే ఈనిర్ణయం తీసుకున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు. 80 ఏళ్లు పైబడిన పింఛన్‌దారుల కోసం ప్రత్యేక విండోను కూడా ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. అంతేగాక పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి డిజిటల్ సర్టిఫికెట్లు సేకరించేలా దేశంలోని పోస్ట్ మ్యాన్లకు బాధ్యత అప్పగించినట్టు ఆయన తెలిపారు. ఇంటి నుంచే డిజిటల్ సర్టిఫికెట్లు పంపే వెసులుబాటు కూడా కల్పించామని ఆయన తెలిపారు. పింఛన్‌దారులు ప్రతిఏటా తాము జీవించి ఉన్నట్టు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలన్న నిబంధన ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News