Sunday, May 12, 2024

లింక్ రోడ్లే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Link road stop the traffic issue in Hyd

హైదరాబాద్: దేశంలోనే అత్యంత ఆకర్షనీయమైన నగరంగా హైదరాబాద్ ఎదుగుతోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి పాత ముంబయి రహదారి లెదర్ పార్క్ వరకు గల లింక్ రోడ్డును మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. లెదర్ పార్క్ వద్ద వియుసి వంతెన నిర్మాణానికి కెటిఆర్ శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. పట్టణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో భాగంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టామన్నారు. గత పాలకులు హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను పట్టించుకోలేదన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం లింక్ రోడ్లను నిర్మిస్తున్నామని, మొదటి దశలో రూ.313.65 కోట్లతో లింక్ రోడ్లను నిర్మిస్తున్నామని, హైదరాబాద్‌లో మొత్తం 137 లింక్ రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. దుర్గం చెరువును అద్భుతంగా తీర్చిదిద్దినామని, హైదరాబాద్‌లో ఆరు వేల కోట్ల రూపాయలతో ఎస్‌ఆర్‌డిపి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంఎల్‌ఎ అరికెపూడి గాంధీ, ఎంఎల్‌ఎ నవీన్ రావు, మేయర్ బొంతు రామ్మోహన్ రావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News