Saturday, April 27, 2024

మధిరలో ట్రాక్టర్ ను ఢీకొట్టిన లారీ

- Advertisement -
- Advertisement -

lorry collided with a tractor in Madhira

మధిర: లోడుతో వెళ్తున్న లారీ ట్రాక్టర్ ను ఢీకొట్టిన ఘటన ఖమ్మం జిల్లా మధిరలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో  డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. మధిర- వైరా చౌరస్తా నవయుగ హోటల్ వద్ద రోడ్డుపై నిలిచిన ట్రాక్టర్ ను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో ట్రాక్టర్ గాలిలోకి ఎగిరిపడింది. ఘటనలో ట్రాక్టర్ నడుపుతున్న ఆత్కూరు గ్రామానికి చెందిన వెంకట రామ నరసయ్య అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని తక్షణమే ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసిటివి కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

lorry collided with a tractor in Madhira

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News