Home తాజా వార్తలు నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

Lovers commits suicide at Nagar Kurnool

హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండలం బిల్లకల్ లో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమజంట చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన బిల్లకల్ అటవీశాఖ చెక్ పోస్టు సమీపంలో జరిగింది. మృతులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. మృతులను అభిఖ(19), అనిల్ (23)గా గుర్తించారు. వీరి ఇంట్లో పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

Lovers commits suicide at Nagar Kurnool