Saturday, April 27, 2024

జూన్ 14 నుంచి ఆన్‌లైన్‌లో ఎల్‌శాట్ పరీక్ష

- Advertisement -
- Advertisement -

LSAT 2020

న్యూఢిల్లీ : 2020 ఎల్‌శాట్‌ఇండియా ప్రవేశ పరీక్షను ఈ ఏడాది జూన్ 14 నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. కొవిడ్19 వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికాకు చెందిన లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్(ఎల్‌శాక్) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించడం ఇదే మొదటిసారి అన్నది గమనార్హం. అభ్యర్థులు తమ ఆరోగ్య జాగ్రత్తల రీత్యా ఇంటి నుంచి లేదా నిర్దేశిత కేంద్రాల నుంచి ఈ పరీక్షకు హాజరు కావొచ్చునని నిర్వాహకులు తెలిపారు.

తమ న్యాయ కళాశాలల్లో చేరాలనుకునేవారు ఈ పరీక్షకు తప్పక హాజరు కావాలని జిందాల్ గ్లోబల్ లా స్కూల్ యాజమాన్యం తెలిపింది. అమెరికాకు చెందిన ఎల్‌శాక్ నిర్వహించే ఈ పరీక్షకు ప్రపంచవ్యాప్తంగా 920 పరీక్షా కేంద్రాల్లో 1,38,000మంది హాజరు కానున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలోని 220 న్యాయ కళాశాలు ఈ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తాయి. అయితే, ఆయా కళాశాలల సొంత నిబంధనల ప్రకారమే ప్రవేశాలు కల్పిస్తారు.

LSAT 2020 hold entrance exam online from 14 June

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News