Saturday, April 27, 2024

‘మా’లో నియామకాలు యమ గోప్యం సుమా!

- Advertisement -
- Advertisement -

MAA Manchu Vishnu

హైదరాబాద్: మూవీ ఆర్టిస్టుల  సంఘం ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యాక ప్రతిదీ గోప్యంగా జరుగుతోందని టాక్. ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ గెలిచిన సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ రాజీనామాలు ఇంకా తన వద్దకు రాలేదని మంచు విష్ణు తెలిపాడు. కానీ ఇప్పుడు వారి స్థానంలో తన ప్యానల్ నుంచి పోటీ చేసి ఓడిపోయినవారిని నియమించుకున్నాడు. ‘మా’ ఇటీవలి ‘దీపావళి గ్రీటింగ్ పోస్టర్’ ఈ విషయాన్నే చాటుతోంది. ‘మా’లో ఏదైనా పారదర్శకంగానే చేస్తామన్న మంచు విష్ణు మాటతప్పుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా ‘మా’ బైలాస్ ప్రకారం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబూ మోహన్‌ను, వైస్ ప్రెసిడెంట్‌గా పృథ్వీరాజ్‌ను ఎన్నికల సంఘం నియమించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News