Tuesday, April 30, 2024

ఫేస్ బుక్ లో ప్రశ్నించినందుకు చంపేశారు…

- Advertisement -
- Advertisement -

ముంబయి: సోషల్ మీడియాలో బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై విమర్శలు  చేసినందుకు కాంగ్రెస్ కార్యకర్తను హత్య చేశారని ఆరోపణలు వచ్చిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయి నగరం సాకినాకా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కాంగ్రెస్ కార్యకర్త మనోజ్ దూబే గత కొన్ని రోజుల నుంచి స్థానికంగా ఉండే ఇబ్బందులు గురించి ఫేస్‌బుక్‌లో గత బిజెపి ప్రభుత్వంపై పోస్టింగ్ చేస్తున్నారు. అసల్ఫా మెట్రో స్టేషన్ సమీపంలో మనోజ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు 16 సార్లు కత్తులతో పొడిచి పారిపోయారు. కొన ఊపిరితో ఉన్న మనోజ్‌ను పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మార్గం మధ్యలో అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పాతకక్షలే మనోజ్ హత్యకు కారణం కావొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. గతంలో పాలించిన బిజెపి ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు హత్య చేశారని స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చవాన్ మండిపడ్డారు. దూబేను బిజెపి కార్యకర్తలు పొట్టనబెట్టుకున్నారని ఆరోపణలు చేశారు. దూబే మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది కాంగ్రెస్ కార్యకర్తని చంపలేదని ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని అశోక్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News