Thursday, May 9, 2024

ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభం: ఉద్దవ్ థాక్రే

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: మహారాష్ట్రలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విలయతాండవం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించేందుకు మహా ప్రభుత్వం అనుమతినచ్చింది. ఈనెల 20 నుంచి కొన్నింటికి సడలింపులు ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వం ఆలోచన ప్రకారం మహా సిఎం ఉద్దవ్ థాక్రే.. వ్యాపార కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చిన్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా థాక్రే మాట్లాడుతూ..”కొన్ని ఆర్థిక కార్యకలాపాలను రేపటి నుంచి ప్రారంభిస్తున్నాము. మేము ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను అమలు చేయనందున, కరోనా సంక్షోభం నుండి బయట పడిన తర్వాత ఆర్థిక సంక్షోభంలో ఉంటాము. అందుకే, కొన్ని వ్యాపార కార్యకలాపాలను పరిమిత మార్గంలో ప్రారంభిస్తున్నాము. అదృష్టవశాత్తూ, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చాలా వరకు కరోనా పాజిటివ్ కేసులు సున్నాగా ఉన్నాయి. రెడ్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాలల్లో సడలింపులు ఉండవు. ఇప్పటివరకు మొత్తం 66వేల టెస్టులు చేశాం. ఇందులో 95 శాతం నెగెటీవ్ వచ్చింది. కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయిన 3600 మందిలో 350కి పైగా మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరో 52 మంది పరిస్థితి సీరియస్ గా ఉన్నారు.. వారిని కూడా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం” అని థాక్రే వివరించారు.

Maha Govt Allows Business Activities in Green Zones

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News