Sunday, May 12, 2024

మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్

- Advertisement -
- Advertisement -

Maharashtra to Face Another Lockdown

మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్
20 నుంచి 22 వరకు అమలు
మాస్క్ ధరించక పోతే రూ.200 జరిమానా

ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడం తో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న విదర్భ ప్రాంతం యవత్మల్, అమరావతి జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించారు. ఈనెల 20 శనివారం రాత్రి 8 గంటల నుంచి 22 సోమవారం ఉదయం 7 గంటల వరకు కఠినమైన లాక్‌డౌన్ అమలులో ఉంటుందని ఆ రెండు జిల్లాల కలెక్టర్లు తెలిపారు. ఈనెల 28 వరకు స్కూళ్లు, కాలేజీలు మూసి ఉంటాయని చెప్పారు. రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాల్స్, వివాహ వేడుకలను 50 శాతం కంటే తక్కువ పరిమితితో నిర్వహించాలని సూచించారు. ఐదుగురు కన్నా ఎక్కువ మంది ఒక చోట గుమికూడదని హెచ్చరించారు. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముంబై నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించక పోతే రూ.200 జరిమానా విధిస్తామని బృహన్ ముంబై కార్పొరేషన్ గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. బస్సులు, లోకల్ రైళ్లలో ప్రయాణించేవారితోపాటు పని ప్రదేశాల్లో కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News