Tuesday, April 30, 2024

గాంధీ ప్రాణాన్ని దేశానికే ధారపోశారు: మల్లారెడ్డి

- Advertisement -
హైదరాబాద్: జాతిపిత మహాత్మా గాంధీ సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి… కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అందించారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు-4 పికెట్ పార్క్ వద్ద మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అగర్వాల్ సమాజ్ సమితి వారు ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మొక్కలు నాటడం జరిగింది.  మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు.
మహాత్మాగాంధీ శాంతి మార్గంలో దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టారని,  వారిని ఆదర్శంగా తీసుకొని శాంతిమార్గంలో సిఎం కెసిఆర్ తెలంగాణను సాధించుకున్నారని చెప్పారు.  భారతదేశంలో మొట్టమొదటి బారిస్టార్లా చదివిన విద్యావేత్త మహాత్మాగాంధీ అని పొగిడారు.  వారి చివరి శ్వాసవరకు దేశం కోసం శ్రమించి తన ప్రాణాన్ని కూడా దేశానికే ధారపోశారని వారి సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని మల్లారెడ్డి ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాజశేఖర్ రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ జక్కుల మహేశ్వర్ రెడ్డి, వార్డు-4 బోర్డు మాజీ మెంబెర్ నళిని కిరణ్, అగర్వాల్ సమాజ్ సమితి ప్రెసిడెంట్ వికాస్ కుమార్ కేషన్, పాండు యాదవ్, అగర్వాల్ సమాజ్ సమితి వైస్ ప్రెసిడెంట్ ఆలోక్ జైన్, రమేష్ అగర్వాల్, కేషరి నందన్ కండోయ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News