Monday, April 29, 2024

సోషల్ మీడియాలో యువతిని వేధిస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Man arrested for harassing young woman on social media

 

మనతెలంగాణ, హైదరాబాద్ : సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతూ మహిళను వేధింపులకు గురిచేస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్‌కు చెందిన చింటపట్ల పవన్‌కుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రాంలో మహిళ ఫొటోలు, అసభ్య మెసేజ్‌లు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఎనిమిదో తరగతి వరకు చదువుకున్న పవన్ పాల వ్యాపారం చేస్తున్నాడు. ఇంటి ఇంటికి వెళ్లి పాలు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలోనే యవతిని ప్రేమిస్తున్నట్లు చెప్పాడు.

దీనికి యువతి నిరాకరించి, తండ్రికి విషయం చెప్పింది. అతడు పవన్ తండ్రికి విషయం చెప్పాడు. దీంతో పవన్‌ను తండ్రి కొట్టడమే కాకుండా మరోసారి ఇలాంటి పనులు చేస్తే సహించేదిలేదని వార్నింగ్ ఇచ్చాడు. ఇది మనసులో పెట్టుకున్న నిందితుడు యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రాంలో పోస్టింగ్ చేస్తున్నాడు, ఫొటో కింద అసభ్య మెసేజ్‌లు పెడుతున్నాడు. బాధితురాలి తల్లి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ శంకర్ కేసు దర్యాప్తు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News