Saturday, May 4, 2024

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

- Advertisement -
- Advertisement -

Man killed pregnant wife

 

చెన్నై: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని సడ్డకుడిని కత్తితో నరికి చంపిన సంఘటన తమిళనాడులోని ట్యూటికొరిన్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. విఘ్నేశ్వరన్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కెటిసి నగర్‌లో నివసిస్తున్నాడు. భార్య సోదరినిని ప్రేమ్ కుమార్ వివాహం చేసుకున్నాడు. విఘ్నేశ్వరన్ భార్యతో ప్రేమ్ కుమార్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విఘ్నేశ్వరన్ భార్య తన ప్రేమకుమార్‌ను ఇంటికి రమ్మని పిలిచింది. విఘ్నేశ్వరన్ తన సోదరుడు, ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రేమ కుమార్‌పై దాడి చేశారు. ప్రేమ కుమార్‌ను విఘ్నేశ్వరన్ కత్తి నరికి అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం తూత్తుకుడి మెడికల్ కాలేజీకి తరలించారు. తలపై పది చోట్ల కత్తి గాట్లు ఉన్నాయని స్థానిక ఎస్‌పి ఎస్ జయకుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News