Sunday, May 12, 2024

గౌడ వృత్తి అస్థిత్వానికి నీరా స్టాల్ ప్రతీక: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Mahaboobnagar Medical college started

హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధితో పాటు ఇప్పటికే నైపుణ్యమున్న కులవృత్తిదారులను పోత్సహించాలని సిఎం కెసిఆర్ చెప్పారని మంత్రి కెటిఆర్ తెలిపారు. నెక్లెస్‌రోడ్‌లో నీరా కేఫ్‌ను మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. అత్యాధునిక హంగులతో 10 స్టాల్స్ నిర్మాణం, 250 మంది కూర్చునేలా నీరా కేఫ్‌లను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో గీత వృత్తిపై రెండు లక్షల మందికిపైగా ఆధారపడి ఉన్నారని, తెలంగాణ ప్రభుత్వం రూ.16 కోట్ల వృత్తి పన్ను బకాయిలను రద్దు చేసిందన్నారు. నీరా స్టాల్ గౌడ వృత్తి వారి అస్థిత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంఎల్‌ఎలు దానం నాగేందర్, ప్రకాశ్ గౌడ్, సిఎస్ సోమేష్ కుమార్, మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News