Tuesday, April 30, 2024

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః నగరంలోని అల్వాల్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్ కుమార్ అనే వ్యక్తి వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. బొల్లారంలో నివాసం ఉంటున్న అరుణ్ కుమార్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. నొప్పి తీవ్రం కావడంతో ఈ నెల 6న ఓల్డ్ అల్వాల్‌లోని ఓ ప్రేవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. అతనికి అన్నీ పరీక్షలు చేసి కడుపులో చిన్న గడ్డ ఏర్పడిందని, దాన్ని తొలగించాలని వైద్యులు చెప్పారు. దీంతో అరుణ్ కుమార్‌కు కుటుంబ సభ్యలు ఆపరేషన్ చేయించారు. అనంతరం అరుణ్ కుమార్ ఆరోగ్యం కుదుటపడడంతో ఈ నెల 11న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే, గత రెండు రోజుల క్రితం కడుపులో నుంచి రక్తం రావడంతో కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించారు.

దీంతో హిమాయత్ నగర్ లోని తమ ఆస్పత్రికి రావాలని వారికి వైద్యులు తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అరుణ్ కుమార్ ఆరోగ్య పరిస్థితని వైద్యులు పరిశీలించారు. కడుపులో నీరు చేరిందని, దాన్ని తీయాలని చెప్పి మరోసారి అతనికి ఆపరేషన్ చేశారు. దీంతో అరుణ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముక్కులో నుంచి రక్తం వచ్చి పరిస్థితి విషమించడంతో కోమాలోకి వెళ్లిన అరుణ్ కుమార్ శనివారం రాత్రి మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో వైద్యుల నిర్లక్షమే కారణంగానే అరుణ్ కుమార్ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అరుణ్ కుమార్‌కు వైద్యులు రెండు సార్లు ఆపరేషన్ చేశారని, వైద్యం వికటించటడంతోనే అరుణ్ కుమార్ మరణించినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళన చేస్తున్నారు.

man died after operation failed in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News