Friday, April 26, 2024

బయ్యారంలో అంతుచిక్కని మిస్టరీ..

- Advertisement -
- Advertisement -

Fire-accident

ఒకే ఇంట్లో దఫ దఫాలుగా అగ్ని ప్రమాదాలు

మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కోటగడ్డ గ్రామ పంచాయితీ పరిధిలో వేములపల్లి రాజు ఇంట్లో ఈ నెల 5వ తారీకు నుండి ప్రతి రోజుకు సుమారు 2 నుండి 3 సార్లు అకస్మాత్తుగా మంటలు చెలరేగడం, వాటిని కుటుంబ సభ్యులు ఆర్పడం జరుగుతోందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమాని వేములపల్లి రాజు తెలుపుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 5, 6, 7, 8వ తారీకు రోజులలో ప్రతి రోజు మూడు నుండి నాలుగు సార్లు తన ఇంట్లోని బెడ్ రూమ్‌లో, బాత్ రూములో, కిచెన్‌లో బట్టలు, టివి, ఫ్రిజ్, ఫోన్ ఇతర ముఖ్య సామాన్లు తగలబడి పోయే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, విద్యుత్ షార్ట్ సర్కూట్ కారణంగా జరుగుతున్నాయేమోననే అనుమానంతో ఒక రోజంతా ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేసి చూశామని, అయినా సరే అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆగడం లేదని, పోలీసులకు సమాచారం అందించగా శుక్రవారం రోజున ఇంటిని సందర్శించి వెళ్ళారని, విచారణ చేసి సమాచారం తెలుపుతామని తెలిపారని ఇంటి యజమాని రాజు తెలిపారు.

ఇంట్లో ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని స్థితి నెలకొని ఉన్నందున విషయం తేలేంతవరకు కుటుంబ సభ్యులతో సహా ఇంట్లోని సామాన్లు ఖాళీ చేసి ఇంటి ముందున్న రేకుల షెడ్‌లోకి మార్చామని, రేకుల షెడ్‌లోనే జీవనం సాగిస్తున్నామని పోలీసులు, అధికారులు, జనవిజ్ఞాన వేధిక వారు త్వరగా మా ఇంట్లో చోటు చేసుకునే అగ్ని ప్రమాదాల విషయం అంతు తేల్చాలని కోరారు యజమాని రాజు తెలిపారు. ఇప్పటి వరకు ఒక సెల్ ఫోన్, టివి, బట్టలు, ఇతర వస్తువులు దగ్దమైపోయాయని తెలిపారు. కాగా ఆ ఇంట్లో వింత శక్తి ఉందని, ఇంతవరకు గ్రామంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న దాకలాలు లేవని, దేవుడు, దయ్యం మాయలంటూ ఆ గ్రామంలోని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం ఆ ఇంటిని సందర్శించారు. విచారణ చేపట్టిన పోలీసులు అతి త్వరలో మిస్టరీని చేదించి తెలుపుతామని, ఇంట్లోని కుటుంబ సభ్యులతో సహా గ్రామంలోని ప్రజలు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని బరోసా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News