Saturday, May 4, 2024

‘టై’ లేదని ఎంపిని పార్లమెంట్ నుంచి పంపేశారు

- Advertisement -
- Advertisement -

Maori MP Rawiri Waititi ejected from Parliament

వెల్లింగ్టన్: సభలో వేసుకున్న డ్రెస్సింగ్ సరిగా లేదని ఎంపిని పార్లమెంట్ నుండి పంపించిన సంఘటన న్యూజిలాండ్ లో చోటుచేసుకుంది. మేజర్ పార్టీకి చెందిన రివైరీ వైటిటి అనే ఎంపి సభలో ఓ ప్రశ్నను అడిగేందుకు ప్రయత్నించాడు. దీంతో స్పీకర్ ట్రెవర్ మల్లార్డ్ రెండుసార్లు రివైరీ వైటిటి చర్చ గదిలో ప్రశ్నలు అడగకుండా అడ్డుకున్నారు. ఎంపిలు టై ధరించినట్లయితే మాత్రమే ప్రశ్న అడగవచ్చని ఆయన పట్టుబట్టారు. అయితే, సభలో మాట్లాడే హక్కు తనకు లేదని, సంప్రదాయాలకు విరుద్ధంగా ‘టై’ కట్టుకోకుండా వచ్చారంటూ సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్ ఆదేశించారు. స్పీకర్ ఆదేశాల మేరకు ఆయన కామ్ గా బయటకు వెళ్తూ.. ‘’టై గురించి కాదు…. ఇది సాంస్కృతిక గుర్తింపు కోసం’’ అంటూ స్పీకర్‌కు తెలిపారు. బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాశ్చాత్య దేశాల డ్రెస్సింగ్ కోడ్‌ను అమలు చేస్తూ వాటినే ధరించాలంటూ పార్లమెంటులో తనకు చెప్పడం తన హక్కులను ఉల్లంఘించడమేనని రావియొరి వాయిటీటీ ఫైర్ అయ్యారు.

Maori MP Rawiri Waititi ejected from Parliament

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News