Thursday, May 9, 2024

తెలంగాణ ప్రభుత్వంపై మాయావతి గుస్సా

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: తెలంగాణలో 10వ తరగతి సోషల్ సైస్సెస్ పాఠ్యపుస్తకాల కవర్ పేజీలలో ముద్రించిన రాజ్యాంగ పీఠికను మార్చడంపై ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్‌పి) అదినేత్రి మాయావతి తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. 10వ తరగతి పాఠ్యపుస్తకాల్లోని కవర్ పేజీలో ముద్రించిన రాజ్యాంగ పీఠిలో సెక్యులర్, సోషలిస్టు అన్న పదాలు మాయం కావడం రాష్ట్ర ప్రభుత్వ సమగ్రతపై, పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని శనివారం ఒక ట్వీట్‌లో మాయావతి విమర్శించారు.

10వ తరగతి సోషల్ సైన్సెస్ పాఠ్య పుస్తకాల్లోని కవర్ పేజీపై ముద్రించిన రాజ్యాగ పీఠిను మార్చడం, సెక్యులర్, సోషలిస్టు అన్న పదాలు మాయం కావడం ప్రభుత్వ సమగ్రత, పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇటువంటి నిర్లక్షం చాలా తీవ్రమైన విషయం. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి. రాజ్యాంగం పట్ల విధేయంగా ఉండడం చాలా ముఖ్యం అంటూ మాయావతి హిందీలో ట్వీట్ చేశారు.

స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్(ఎస్‌సిఇఆర్‌టి)కు చెందిన 10వ తరగతి సోషల్ సైన్సెస్ టెక్ట్ బుక్స్ కవర్ పేజీపై ముద్రించిన రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్టు పదాలు మాయం కావడంతో వివాదం ఏర్పడింది. తెలుగు, ఇంగీష్ మీడియంకు చెందిన సోషల్ సైన్సెస్ స్టడీస్ కొత్త పాఠ్యప్తుకాలను ఇటీవలే ఎస్‌సిఇఆర్‌టి విద్యార్థులకు పంపిణీ చేసింది. అయితే పుస్తకం తెరచిన ప్రజలకు అందులో ఘోర తప్పిందం కనిపించింది. కాగా..లోపలి పేజీల్లో ముద్రించిన రాజ్యాంగ పీఠికలో సోషలిస్టు, సెక్యులర్ పదాలు ఉండగా కవర్ పేజీపైన ముద్రించిన పీఠికలో మాత్రం ఆ పదాలు మాయమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News