Saturday, April 27, 2024

ప్రజారోగ్య వైద్య సంచాలకులు ఆకస్మిక తనిఖీ…

- Advertisement -
- Advertisement -

 

సూర్యాపేట : ప్రజారోగ్య వైద్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఎస్పి రాజేంద్రప్రసాద్, డిఎంహెచ్ ఒ డాక్టర్ కోటాచలం, ఇతర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో కలిసి కంటి వెలుగు కార్యక్రమంపై చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నందు పాల్గొన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్యక్రమం విజయవంతం చేయడానికి పలు సూచనలను వారితో పంచుకున్నారు. తరువాత అంబేద్కర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సిబ్బంది నిర్వహిస్తున్న మోడల్ క్యాంపును సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

సిబ్బందికి కార్యక్రమం పై అవగాహన కల్పించి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీనికి అన్ని విధాల తమ సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఎదురవుతే, పరిష్కారానికి అన్ని విధాల చేయూతనందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఒ, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ నజియా, డాక్టర్ రమ్య రెడ్డి, డిపిఒ కిరణ్, ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News