Monday, April 29, 2024

టీమిండియాపై వాన్ సెటైర్లు

- Advertisement -
- Advertisement -

Michael Vaughan schools Team India after 2nd ODI loss to England

 

లండన్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ టీమిండియాపై తన అక్కసును మరోసారి బయటపెట్టాడు. రెండో వన్డేల్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి పాలు కావడంపై వాన్ తనదైన శైలీలో సెటైర్లు వేశాడు. రెండో మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించినా దాన్ని నిలబెట్టుకోక పోవడం టీమిండియా బౌలర్ల సత్తాకు నిదర్శనమన్నాడు. ఎంత పెద్ద స్కోరునైనా ఛేదించే సత్తా తనకుందని ఇంగ్లండ్ మరోసారి నిరూపించిందన్నాడు. ఇక రెండు వన్డేల్లో భారత్ భారీ స్కోర్లు సాధించినా ఏదో ఒక వెలితి కొట్టోచ్చినట్టు కనబడుతుందన్నాడు. ఆరంభ ఓవర్లలో నెమ్మదిగా ఆడడం రెండు మ్యాచుల్లోనూ స్పష్టమైందని వాన్ అభిప్రాయపడ్డాడు. ఈ లోపాన్ని టీమిండియా సవరించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News