Home టెక్ ట్రెండ్స్ మార్కెట్లోకి మైక్రోమాక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్లు

మార్కెట్లోకి మైక్రోమాక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్లు

Micromax New Smartphones into Market

ముంబై: దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ మంగళవారం రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. ‘ఐఎన్’ పేరటి లాంచ్ చేసిన ఈ ఫోన్లు మైక్రోమాక్స్ ఐఎన్ 1బి, మైక్రోమాక్స్ ఐఎన్ నోట్1 అనే రెండు మోడళ్లలో అందుబాటులోకి వచ్చాయి. ఐఎన్ 1బి కంపెనీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా సంస్థ తెలిపింది. చాలా కాలం తర్వాత మైక్రోమాక్స్ ఈ రెండు సరికొత్త ఫోన్లతో మార్కెట్లోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్లు ఎలాంటి యాడ్స్, బ్లోట్వేర్ లేని ఆండ్రాయిడ్ ఒఎస్ అనుభవాన్ని అందిస్తాయని కంపెనీ వెల్లడించింది. ఐఎన్ నోట్1 మోడల్ ఫీచర్ల విషయానికొస్తే 6.67 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ హెలియో జి85 ఆక్టాకోర్ ప్రాసెసర్, 5000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థం, 18డబ్లు ఫాస్ట్ చార్జర్ వంటివి కల్గి ఉన్నాయి. ఇది 4జిబి + 64జిబి, అలాగే 4జిబి + 128జిబి వేరియంట్ల ధరలు వరుసగా రూ.10,999, రూ.12,499 లభ్యం కానున్నాయి.

Micromax New Smartphones into Market