Monday, April 29, 2024

ప్రైవేటు ఆస్పత్రిల్లో కరోనా టెస్టు ధర రూ.2,200..

- Advertisement -
- Advertisement -

Minister Etela Rajender press meet on Coronavirus

 

హైదరాబాద్‌ః మహమ్మారి కరోనా వైరస్ కట్టడికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం మంత్రి ఈటల మీడియాతో మాట్లాడారు. ఐసిఎంఆర్ గైడ్ లైన్స్‌ను తూ.చా. తప్పకుండా పాటిస్తున్నాం. తెలంగాణలో కమ్యూనిటీ స్ప్రెడ్ లేదని ఐసిఎంఆర్ స్పస్టం చేసింది. ఐసిఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే కరోనా పరీక్షలు. ప్రైవేటు ఆస్పత్రిల్లో కరోనా టెస్టుకు రూ.2,200గా నిర్ణయం. వెంటిలేటర్ లేకుండా చికిత్స అందిస్తే రోజుకు రూ.7,500.. వెంటిలేటర్‌తో చికిత్స చేస్తే రోజుకు రూ.9 వేలు. బెంగళూరులో కరోనా టెస్టుకు ధర రూ.4,500గా ఉంది. ఏ మాత్రం అనుమానం ఉన్నా కరోనా పరీక్షలు చేస్తాం. లాక్‌డైన్ ఎత్తివేశాక హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో సామాజిక వ్యాప్తి లేదని కేంద్రం ప్రకటించింది. పరీక్షలో పాజిటీవ్ వచ్చినా ఎలాంటి లక్షణాలు లేకపోతే హోంఐసోలేషన్ ఉండాలి’ అని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

Minister Etela Rajender press meet on Coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News