Saturday, April 27, 2024

ప్రజారోగ్యానికి ప్రాధాన్యత…

- Advertisement -
- Advertisement -

Minister Harish inaugurated Basti dawakhana in Siddipet KCR Nagar

నిరుపేదల నీడలో.. మెరుగైన సర్కారు వైద్యం…

సిద్దిపేట డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్ లో 18 లక్షలతో బస్తీ దవాఖాన శాశ్వత భవనం

కేసీఆర్ నగర్ లో బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి హరిశ్ రావు 

సిద్దిపేట: ప్రజాఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని అనటానికి నిదర్శనం బస్తీ దవాఖానాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట లో డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్ లో బస్తీ దవాఖాన నూతన భవనాన్ని మంత్రి హరీశ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా సిద్దిపేట లోని డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్ లో గతంలో తాత్కాలిక భవనంలో బస్తీ దవాఖాన సేవలు అందుబాటులోకి ఉండే, 18 లక్షలతో ఇటీవలే పక్కా భవనం నిర్మాణం చేసుకున్నాం. దీనితో కేసీఆర్ నగర్ లో పేద ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. నిరుపేద నీడలో మెరుగైన వైద్య సౌకర్యం ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

బస్తీ దవాఖానాల్లో అవుట్​ పేషెంట్​ సేవలు అందించడం సహా బీపీ, షుగర్​తో పాటు 57 రకాల వైద్య పరీక్షలను చేస్తారు. ఇక్కడ సేకరించిన న‌మూనాలను సిద్దిపేట వైద్య కళాశాల ఆసుపత్రిలో ని తెలంగాణ స్టేట్ డ‌యాగ్నస్టిక్​ సెంటర్​కు పంపిస్తారు. సుమారు 150 రకాల మందులను ఉచితంగా అందిస్తామని , స్వల్పకాల అనారోగ్యానికి తక్షణ వైద్య చికిత్సలు అందించడం సహా టీకాలు వేయడం, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సిలింగ్ ఇస్తారు.ఇక పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం లో బస్తీ దవాఖాన ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు.

– ప్రభుత్వ వైద్య సేవల పై ప్రజల్లో అవగాహన కలిపించాలి…

ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవల పై ప్రజల్లో అవగాహన కలిపించాలని, నార్మల్ డెలివరీలు జరిగేల చూడాలని ఆశ , ఏ ఎన్ ఎం లను మంత్రి హరీష్ రావు గారు సూచించారు. బస్తీ దవాఖాన వద్ద ఆశ ఏఎన్ఎంలతో ముచ్చటించారు. ప్రజలు ప్రయివేటు ఆసుపత్రి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య సేవలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. పేద ప్రజలకు ప్రయివేటు ఆసుపత్రి కి వెళ్లి ఆర్థిక భారం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు తెలియపరచాలని, నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలని సూచించారు. మీకు నెలకు 3వేల పారితోషకం కూడా ఇస్తున్నాం అని చెప్పారు. పిహెచ్ ల వారిగా గత నెలలో డెలివరీ ల పై ఆరా తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News