Monday, April 29, 2024

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR Review on double bedroom houses in Hyderabad

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సకల సౌకర్యాలతో నిర్మించిన డబల్ బెడ్‌రూం ఇళ్లను ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ జియాగూడలోని అంబేద్కర్ నగర్ లో సోమవారం ప్రారంభించారు. మంత్రి కెటిఆర్ కు బోనాలతో మహిళలు ఘనస్వాగతం పలికారు. జియాగూడ డిగ్నిటీ హౌసింగ్ కాలనీలో 840 ఇళ్లను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. తొలి ప్రాధాన్యతగా మున్సిపల్ క్వార్టర్స్ వాసులకు ఇళ్లను కేటాయించింది. ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు పలువురు కార్యకర్తలు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. పేదలకు ప్రభుత్వం దసరా బహుమతి అందిస్తోంది. ఇవాళ నగరంలోని మూడు చోట్ల డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంత్రి ప్రారంభించనున్నారు. జియాగూడలోని 840 ఇళ్లను, 11 గంటలకు గోడే కి కబర్‌లో 192 ఇళ్లను, 11.30 గంటలకు కట్టెల మండిలో 120 డబల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంత్రి కెటిఆర్ ప్రారంభిస్తారు.

KTR Review on double bedroom houses in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News