Friday, April 26, 2024

ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కెసిఆర్…

- Advertisement -
- Advertisement -

Minister KTR

రాజన్న సిరిసిల్ల: ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు సిఎం కెసిఆర్ అని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మంత్రులు, కెటిఆర్, నిరంజన్ రెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ లో రైతువేదిక నిర్మాణానికి, రాచర్లగొల్లపల్లిలో వ్యవసాయ గోదాంకు, రైతు భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. రాచర్లబొప్పాపూర్ లో మార్కెట్ కమిటీ పరిపాలన భవనం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పలువురు టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ… ప్రపంచమంతా కరోనాతో గందరగోళంలో ఉందని మంత్రి చెప్పారు.

అమెరికా మొదలుకుని భారతదేశం వరకు తల్లడిల్లుతుంది. అన్ని దేశాలకు ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడింది. మార్చి, ఏప్రిల్ రాష్ట్ర ఆదాయం 95శాతం తగ్గింది. ఇంత సంక్షోభంలోనూ రైతులకు రూ.1200కోట్ల రుణమాఫీ చేశాం. వానాకాం సాగు కోసం నిధులు అందజేశారు. ఎరువులు, విత్తనాలు అందించేందుకు సిఎం ఆర్థిక చేయూత అందించారు. ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు సిఎం కెసిఆర్. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజలు కష్టాలు తీర్చారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నాం. ఎరువులు, విత్తనాలు ముందస్తుగా తీసుకొచ్చి వరుసల్లో నిలబడకుండా చేశాం.

సిరిసిల్ల జిల్లాలో 2.5లక్షల ఎకరాలకు కాల్వల ద్వారా నీరు అందిస్తాం. దసరా వరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. పిల్లకాల్వ ద్వారా గ్రామాల్లో పదెకరాలు భూమి పోతుంది. పదిమంది రైతులు భూమి కోల్పోతే వందలమంది రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. రైతులందరికీ న్యాయం చేస్తాం. గోదావరి జలాలతో సిరిసిల్లను సుందర పట్టణంగా తీర్చిదిద్దాం. మద్దతు ధర లేని పంటలు వేయొద్దని సిఎం చెబుతున్నారు. మద్దతు ధర వచ్చే పంటలు వేస్తే రైతులు బాగుపడుతారన్నదే సిఎం ఆకాంక్ష. ప్రతిగ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నాం. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్లు మేర భూగర్భజలాలు పెరిగాయి.

కాంగ్రెస్ నాయకులు పోతిరెడ్డిపాడు అంటూ గగ్గోలు పెడుతున్నారు. పోతిరెడ్డిపాటు జీవో ఇచ్చింది రాజశేఖరెడ్డి ప్రభుత్వం కాదా..? ఆరోజు కళ్లప్పగించి చూసింది ఈ కాంగ్రెస్ నయకులు కాదా..? ఈ రోజు పోతిరెడ్డిపాడుపై అనవసర రాద్ధాతం చేస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం. ఎండాకాలంలో నీళ్లు అందిస్తున్న కాళేశ్వరంపై కూడా విమర్శలు చేస్తున్నారు. రైతులకు అన్యాయం చేసే పని కెసిఆర్ చేయరు…ఎవరినీ చేయనీయరు. రైతును రాజును చేయాలన్నదే సిఎం కెసిఆర్ ఆలోచన.

విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినప్పుడు మొదట విమర్శిస్తారు. మనమంతా సంఘటితమై విజయం సాధిస్తే అందరూ మనవెంటే వస్తారు. గ్రామాల్లో, వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పుల కోసమే రైతు వేదికలు. ఆరు మండలాల్లో వ్యక్తిగతంగా రైతు వేదికల నిర్మాణం చేయిస్తాం. గోవావరి జలాలతో సిరిసిల్ల ప్రాంతాల్లో కోనసీమగా తీర్చిదిద్దుతామని కెటిఆర్ పేర్కొన్నారు.

Minister KTR lays foundation for Rythu vedika in Sircilla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News