Saturday, May 4, 2024

కెటిఆర్ కు మద్దతుగా మంత్రి పువ్వాడ..

- Advertisement -
- Advertisement -

Minister Puvvada denied Mallanna comments

ఖమ్మం: రాష్ట్ర ఐటి, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావుకు కెటిఆర్‌ తనయుడు హిమాన్షుపై బిజెపి నేత తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖండించారు. ఈ సందర్భంగా కెటిఆర్ కు మంత్రి పువ్వాడ మద్దతుగా నిలిచారు. రాజకీయాల్లోకి చిన్నపిల్లలను లాగి, కించ పరిచే విధంగా పోస్టులు పెట్టి తీన్మార్ మల్లన్న దర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ప్రభుత్వంలో ఉన్నాము కదా అని సంయమనం పాటిస్తున్నామని, తమ కార్యకర్తలు ఆవేశంలో ఏదైనా చేస్తే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకుల గురించి తాము మాట్లాడలేకనా, హానికరమైన సమాచారాన్ని వ్యాప్తి చేసేలా సోషల్ మీడియా యంత్రాంగాన్ని ప్రోత్సహించడం బిజెపికి తెలిసిన వ్యూహమని మంత్రి అజయ్ మండిపడ్డాడు.

Minister Puvvada denied Mallanna comments

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News