Monday, April 29, 2024

గ్రామాలకు మంచి నీరు… మిషన్ భగీరథే ఆదర్శం: కేంద్రం

- Advertisement -
- Advertisement -

Mission Bhagiratha ideal for drinking water

 

హైదరాబాద్: 2024 సంవత్సరం కల్లా ఫంక్షనల్ హౌజ్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి రోజూ 55 లీటర్ల నీటిని  అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం మార్గదర్శకాలను రూపొందించింది. జెజెఎం ద్వారా నీటి పంపిణీలో నష్టాలను నివారించేందుకు మార్గదర్శకాలు తయారు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. తాగు నీటి సరఫరాలో తెలంగాణ మోడల్‌ను అనుసరించాలని కేంద్రం సూచించింది. గ్రామీణ ప్రాంతాలకు మంచి నీటి సౌకర్యం కల్పించే విషయంలో తెలంగాణ అందరికీ ఆదర్శంగా నిలిచిందని లేఖలో కేంద్రం పేర్కొంది. మిషన్ భగీరథ ద్వారా తక్కువ ఖర్చుతో ప్రతి ఇంటికి మంచినీటిని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని కితాబిచ్చారు. ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని లేఖలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News