Monday, April 29, 2024

పల్లెను కాపాడిన మిషన్ కాకతీయ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా చెరువులను బలోపేతం చేసిన ఫలితం ప్రస్తుతం కనిపిస్తోంది. రాష్ట్రంలో చెరువుల పరిస్థితిని మిషన్ కాకతీయకు ముందు, తర్వాత అని విభజించి నమోదైన వర్షాలతో విశ్లేషిస్తే మిషన్ కాకతీయ తర్వాత తెగిన చెరువుల సంఖ్య వేల నుంచి వందలకు పడిపోయింది. పునరుద్ధరించిన చెరువులు పల్లెలు, వ్యవసాయాన్ని గణనీయ స్థాయిలో కాపాడాయి. ఇదే రీతిలో మహానగరమైన హైదరాబాద్‌ను శివార్ల చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించడం ద్వారా వరదల నుంచి కాపాడుకోవాలి.

1908 నాటి భయంకర పరిస్థితులు పునరావృ తం కాకుండా మిషన్ కాకతీయ అడ్డుకట్ట వేసింది. 1908 లో జరిగినట్టు వందల సంఖ్యలో చెరువులు తెగిపోయి ఉంటే పరిస్థితి ఊహించతరం కాదు. మిషన్ కాకతీయ కార్య్రక్రమం ఫలితాల గురించి నాబార్డు, ఇంటర్నేషనల్ వాట ర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్(IWMI), శ్రీలంక, చికాగో యూనివర్సిటీ, మిచిగాన్ యూనివర్సిటీ వారి అ ధ్యయనాలు గతంలో విస్తృతంగా చర్చకు వచ్చా యి. ఈ అధ్యయనాలు అన్నీ కూడా చెరువుల పునరుద్దరణ వలన సాగు విస్తీర్ణం, పూడిక మట్టి చల్లుకోవడం వలన పెరిగిన పంటల దిగుబడి, తగ్గిన రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం, భూగర్భ జలాల పెంపు, చేపల పెంపకంలో వృద్ది, పెరిగిన రైతుల ఆదాయాలు తదిత ర వ్యవసాయ సంబందిత అంశాలపై సాగింది. అ యితే 2016 లో సంభవించిన భారీ వర్షాలకు చెరువులు తట్టుకొని నిలబడినాయి. ఆ సంవత్స రం వచ్చిన వరదలకు అతి తక్కువ సంఖ్యలో చెరువులు తెగిపోయిన, అతి తక్కువ సంఖ్యలో నష్టాలు జరిగిన తీరు సాగునీటి శాఖ అధికారుల అనుభవంలోకి వచ్చింది. మిషన్ కాకతీయ అమలుకు ముందు సంవత్సరాల్లో వరద నష్టాలను మిషన్ కాకతీయ అమలు తర్వాత 2016 వరద నష్టాలతో పోల్చి అధ్యయనం చేసినప్పుడు గణనీయమైన మార్పును గమనించడం జరిగింది. 2016 లాగానే 2013 లో కూడా భారీ వర్షాలు కురిసినాయి. ఆ సంవత్సరం తెగిపోయిన చెరువుల సంఖ్య చాలా ఎక్కువ. మిషన్ కాకతీయ అమలుకు ముందు, తర్వాత చెరువుల నష్టాల గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి.
పై పట్టికను పరిశీలిస్తే మిషన్ కాకతీయకు ముందు భారీ వర్షపాతం నమోదు అయిన 2009, 2010, 2013 సంవత్సరాలలో తెగిపోయిన చెరువుల సంఖ్య వేలల్లో ఉన్నది. మిషన్ కాకతీయ అమలు తర్వాత 2016, 2019, 2020 సంవత్సరాలలో కురిసినా అతి భారీ వర్షాలకు తెగిపోయిన చెరువుల సంఖ్య 930, 100 మరియి 386 మాత్రమే. మిషన్ కాకతీయలో బలోపేతం అయిన రువుచెలు ఇంతటి భారీ వర్షాన్ని తట్టుకొని నిలబడగలిగినాయి. అక్టోబర్ 13,14 రెండు రోజులు హైదారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కురిసిన వర్షం గత 150 సంవత్సరాల్లో రెండవ అతి పెద్ద వర్షపాతం. 25-32 సెంటీమీటర్ల వర్షపాతాన్నితట్టుకొని చెరువులు నిలబడినాయి. సాగునీటి శాఖ సేకరించిన వివరాల ప్రకారం మూసీ పరీవాహక ప్రాంతం మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలలో తెగిపోయిన చెరువుల సంఖ్య 14 మాత్రమే. ఇక 2020 లో ఇప్పటి వరకు కృష్ణా బెసీన్లో తెగిపోయిన చెరువుల సంఖ్య 206, గోదావరి బెసీన్లో 180, మొత్తం రాష్ట్రం తెగినపోయిన చెరువుల సంఖ్య 386.
2016 లో సెప్టెంబరులో కురిసిన వర్షం 100 ఏండ్లకు ఒక్కసారి వచ్చే పెద్ద వర్షం. అయినా కూడా మిషన్ కాకతీయలో చెరువు కట్టలు బలోపేతం అయిన కారణంగా, చెరువుల అలుగులు, తూములు బాగు అయిన కారణంగా వరదలకు తెగిపోయిన చెరువులు, ఇతరత్రా నష్టపోయిన చెరువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వేల సంఖ్యలో నష్టానికి గురి అయ్యే చెరువులు వందల్లోకి పడిపోయినాయి. 2016 నాటికి మిషన్ కాకతీయలో రెండు దశలు మాత్రమే అమలు అయినాయి. ఆ తర్వాత 2019 లో , 2020 ఆగస్టు నుంచి భారీ వర్షాలు కురినాయి. ఆనాటికి నాలుగు దశల చెరువుల పునరుద్దరణ పూర్తి అయినందున తెగిపోయిన చెరువుల సంఖ్య మరింత తగ్గడం గమనార్హం. అక్టోబర్ 13,14 రెండు రోజులు రాష్ట్రంలో కురిసిన వర్షాలు అతి భారీ వర్షాలుగా పరిగణించాలి. ఇంతటి భారీ వరదలను తట్టుకొని తెలంగాణ చెరువులు నిలబడినాయంటే మిషన్ కాకతీయ అమలు కారణమని చెప్పవచ్చు. హైదారాబాద్ నగరాన్ని, శివారు ప్రాంతాలను భారీ వరద ముప్పు నుంచి రక్షించినాయి.
చెరువుల స్థితిగతులను చూస్తే.. 14 అక్టోబర్ నాటికి కృష్ణా బెసీన్లో 25 % నిండిన చెరువులు 1769, 50 % నిండిన చెరువులు 1148 75% నిండిన చెరువులు 1718, 100 నిండిన చెరువులు 3766, అలుగు పారుతున్న చెరువులు 14900. గోదావరి బెసీన్లో 25 నిండిన చెరువులు 133, 50% నిండిన చెరువులు 552, 75% నిండిన చెరువులు 1928, 100% నిండిన చెరువులు 8206, అలుగు పారుతున్న చెరువులు 9292. రాష్ట్రంలో అలుగు పారుతున్న మొత్తం చెరువుల సంఖ్య 24192. నాలుగు దశల్లో మిషన్ కాకతీయ అమలు తర్వాత రాష్ట్రంలో చెరువుల కింద 15.50 లక్షల ఎకరాలు స్థిరీకరించబడినాయి. మొత్తం మీద గతంలో ఎన్నడూ లేని విధంగా చెరువుల కింద 25 లక్షల ఎకరాలు సాగులోనికి రావడం మిషన్ కాకతీయ సాధించిన విజయం. మిషన్ కాకతీయ దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు స్ఫూర్తిని ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ తరహాలోనే జల్ యుక్త్ శివార్ అభియాన్ పేరిట చెరువుల పునరుద్దరణ కార్యక్రమాన్ని రూపొందించి 2016 నుంచి అమలు చేస్తున్నది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ & పవర్ (CBIP) వారు మిషన్ కాకతీయకు అత్యున్నత నీటి సంరక్షణ కార్యక్రమంగా గుర్తించి 2018 లో అవార్డును ప్రధానం చేసింది.
1908 సెపెంబర్ 26, 27న మూసీ పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షపాతం కూడా అక్టోబర్ 13,14 న కురిసిన వర్షపాతంతో పోల్చతగినదే. 32.50 సెంటీమీటర్ల వర్షపాతం ఆనాడు నమోదు అయ్యింది. ఆ రెండు రోజుల వర్షం కారణంగా సెప్టెంబర్ 28 న హైదారాబాద్ నగరాన్ని అసాధారణ వరదలు ముంచెత్తాయి. నగరానికి ఎగువన మూసి పరీవాహక ప్రాంతంలో ఉన్న 788 చెరువుల్లో 221 చెరువులు తెగిపోయి మూసి నదిలోకి మొదటి రోజు 1,10,000 క్యూసెక్కుల వరద వస్తే రెండో రోజుకు అది 4,25,000 క్యూసెక్కులకు పెరిగింది. ఈ వరద భీభత్సానికి మూసి నదికి ఇరువైపులా ఒక చరపు మైలు విస్తీర్ణంలో 19 వేల ఇండ్లు కూలిపోయాయి. 80 వేల మండి నిర్స్శ్రయులు అయ్యారు. సుమారు 10 నుండి 15 వేల మండి వరదల్లో కొట్టుకుపోయారు. వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. వరదలు తగ్గు ముఖం పట్టిన తర్వాత ఆ భీభత్స దృశ్యాలు వర్ణించనలవి కానంత దుర్భరంగా ఉన్నాయి. మూసికి రెండు వైపిలా ఎటు చూసినా కూలిన ఇండ్లు, చెట్లు, బండరాళ్ళు, బురద, కుళ్లిన మనుషుల, పశువుల శవాలు.. ఇదీ పరిస్తితి. ఇవ్వాల్ల పరిస్తితి దుర్భరంగా ఉన్న మాట వాస్తవమే. కానీ 1908 నాటి భీభత్స దృశ్యాలతో పోల్చలేము. ఆనాడు తెగిపోయిన చెరువుల సంఖ్యతో పోలిస్తే ఈ రోజు తెగిపోయిన చెరువులు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. అయినా హైదారాబాద్ నగరంలో, శివారు ప్రాంతాల్లో ఈ స్థితికి కారణం ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి నగర విస్తరణ ఒక పద్దతీ పాడూ లేకుండా చెరువులను, నాలాలను ద్వంసం చేస్తూ, కబ్జాలు చేస్తూ ఇబ్బడి మబ్బడిగా కాలనీలు వెలసినాయి. వర్షపు నీరు సహజ పద్దతిలో ప్రవహించే వీలు లేకుండా అడ్డంగా భవనాలు , అపార్ట్మెంట్స్ నిర్మిస్తే నీరు వాటిల్లోకి చొరబడక ఏమి చేస్తాయి? నీటి తావులను మనం కబ్జా చేస్తే అవి మనలని ముంచక ఏమి చేస్తాయి? ఈ పాపమంతా ఉమ్మడి రాష్ట్ర పాలకుల పుణ్యమే. ఈ అస్తవ్యస్త పరిస్థితిని సవరించడానికి ఏ ప్రభుత్వానికైనా కత్తి మీద సాము లాంటిదే. ఎందు కంటే వాటిల్లో ఇండ్లు కట్టుకున్నది పేద, మధ్యతరగతి ప్రజలే. చెరువులను, నాలాలను కబ్జా చేసి ఈ అక్రమ లేఅవుట్లను తయారు చేసి అమ్మి సొమ్ము చేసుకున్నది పాలకులు, పాలక వర్గాల దళారీలు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి పేదలకు అమ్మిన వారు ఎవరో అందరికీ ఎరుకే. ఈ పరిస్థికి కారణమైనవారే ఇవ్వాల్ల హైదారాబాద్ లో ప్రజలు పడుతున్న కడగండ్లకు ఆరేండ్ల తెలంగాణ ప్రభుత్వాన్ని బాద్యులను చేయడం విడ్డూరం. ప్రభుత్వం హైదరాబాద్‌లో ఈ స్థితిని మార్చడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. అయినా ఇంకా చేయవలసినది ఎంతో ఉన్నది. హైదారాబాద్ లో నాలాలను విస్తరించవలసి ఉన్నది. శివారుల్లో చెరువుల వరద నీరు సాఫీగా పోవడానికి దారులు ఏర్పాటు చేయవలసి ఉన్నది. చెరువుల కబ్జాలను కఠినంగా నిరోదించవలసి ఉన్నది. హైదారాబాద్ డ్రైనేజి వ్యవస్థను చక్కదిద్దాడానికి శాస్త్రీయమైన అధ్యయనం చేయవలసి ఉన్నది. ఈ కష్ట సమయంలో అందరూ రాజకీయాలకు తావు లేకుండా ప్రజలను ఆదుకోవడంపై దృష్టి పెట్టవలసిన సమయం ఇది. అందరికీ అన్నం పెట్టె నగరానికి సున్నం పెట్టె చేష్టలకు పాల్పడటం శోచనీయం.

Mission Kakatiya ponds filled with heavy floods

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News