Monday, May 6, 2024

అవి ‘వదంతులే’

- Advertisement -
- Advertisement -

తన కుమారునికి ఉప ముఖ్యమంత్రి పదవి ఊహాగానాల ఖండన
ఆరోగ్యంగానే ఉన్నా : ఎంకె స్టాలిన్

చెన్నై : తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా తన కుమారుడు ఉదయనిధిని నియమించనున్నానని సాగుతున్న ఊహాగానాలను ‘వదంతులు’గా ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ శనివారం కొట్టివేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 21న సేలంలో జరగనున్న డిఎంకె యువజన విభాగం మహాసభను వ్యతిరేకిస్తున్న వ్యక్తులు అటువంటి వదంతులను వ్యాప్తి చేస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు.

సేలం మహాసభ కోసం రాష్ట్రవ్యాప్తంగా యువత సిద్ధం అవుతుండగా వదంతుల వ్యాప్తిలో నిమగ్నమైన వారు ‘నా ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు’ అని స్టాలిన్ సంక్రాంతి శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు. తాను చెన్నైలో శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్నానని, రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నప్పుడు తాను ఆందోళన చెందనవసరం లేదని ఆ కార్యక్రమంలో చెప్పానని స్టాలిన్ తెలిపారు.

‘నేను ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నాను. పని చేస్తూనే ఉన్నాను’ అని 70 ఏళ్ల స్టాలిన్ చెప్పారు. ‘ఈ సంగతి అసత్యంగా తేల్చిన తరువాత ఉప ముఖ్యమంత్రి (ఉదయనిధికి) ఇవ్వబోతున్నట్లుగా సంచలనం సృష్టించే ఉద్దేశంతో వదంతులు వ్యాప్తి చేస్తున్నారు’ అని ఆయన తెలిపారు. ఉదయనిధి స్వయంగా దీనిపై స్పందించినట్లు, మంత్రులు అందరూ సిఎంకు సాయం చేస్తున్నారని చెప్పి ఈ సమస్యకు ముగింపు పలికినట్లు స్టాలిన్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News