Monday, April 29, 2024

సిఎఎపై నిషేధం… నీట్ రద్దు: మేనిఫెస్టో విడుదల చేసిన స్టాలిన్

- Advertisement -
- Advertisement -

చెన్నై : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కెస్టాలిన్ బుధవారం మేనిఫెస్టోని విడుదల చేశారు. పుదుచ్చేరికి రాష్ట్రహోదా, నీట్ పరీక్షలపై నిషేధం, ముఖ్యమంత్రికి గవర్నర్‌ను నియమించే అధికారం వంటి ఇతర హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ మేనిఫెస్టోను రూపొందించినందుకు తన సోదరి కనిమోళిని స్టాలిన్ ప్రశంసించారు. ప్రతి జిల్లాకు సంబంధించిన పథకాలపై కనిమొళి అద్భుతమైన మేనిఫెస్టోను రూపొందించారని అన్నారు. మేనిఫెస్టోతోపాటు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా స్టాలిన్ ప్రకటించారు. అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రూపొందించిన మేనిఫెస్టోలో ఏం చెప్పామో డిఎంకె అదే చేస్తుంది. మా నాయకులకు అదే నేర్పాం. ద్రవిడ మోడల్ లో అమలు చేసిన పథకాలు తమిళనాడు అభివృద్ధిని దేశమంతా వ్యాప్తి చేసేలా చేస్తాయని పేర్కొన్నారు.

మేనిఫెస్టో లోని అంశాలు
1. రాష్ట్రాలకు సమాఖ్య హక్కులు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ
2. చెన్నైలో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు
3. పుదుచ్చేరికి రాష్ట్రహోదా
4. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి ) ఉపసంహరణ
5. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు
6. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం సదుపాయం
7. నీట్‌పై నిషేధం
8. రాష్ట్రంలో టోల్‌గేట్ల తొలగింపు
9. రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఎఎ) పై నిషేధం
10. ఎల్పీజీ గ్యాస్ 500, లీటర్ పెట్రోల్ రూ. 75, డీజిల్ రూ.65 అందిస్తూ నిర్ణయం.
11. తిరుకురల్‌ను ‘నేషనల్ బుక్ ’గా తీర్చిదిద్దేలా నిర్ణయం

12. దేశానికి తిరిగి వచ్చిన శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం
13. గవర్నర్‌లకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుండి మినహాయింపునిచ్చే ఆర్టికల్ 36ల1 సవరణ
13. కొత్త ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈ, ఐఐఏఆర్‌ఐలు ఏర్పాటుతో పాటు ఇతర హామీలు నెరవేర్చేలా మేనిఫెస్టోని సిద్ధం చేసిన డీఎంకే

డిఎంకె లోక్‌సభ అభ్యర్థులు వీరే
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న 21 మంది అభ్యర్థుల జాబితాను సిఎం స్టాలిన్ విడుదల చేశారు. వారిలో డీఎంకే పార్టీలో కీలకనేతలైన కె కనిమొళి, ఎ రాజా, బాలు తదితరులు ఉన్నారు. వీరు కాక మిగతా 18 మందిలో పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, విసికె పార్టీ అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 21 మందిలో 11 మంది కొత్తవారు కాగా, వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరిలో ప్రస్తుత దక్షిణ చెన్నై, ఎస్ ఎంపి తమిజాచి తంగపాండ్యన్ సెంట్రల్ చెన్నై దయానిధి మారన్, శ్రీ పెరంబుత్తూరు టీఆర్ బాలు, అరకోణం జగత్రాచహన్, వెల్లూరు కందిర్ ఆనంద్ లను బరిలోకి దించాలని పార్టీ నిర్ణయించింది. వీరితోపాటు తిరువనమలై అన్నాదురై, ఆరణిధరణి, సేలంసెల్వగపతి, ఈరోడ్ ప్రకాష్, నీలగిరి ఏ రాజా, కోవై గణపతి రాజ్‌కుమార్, పెరంబుదూరు అరుణ్ నేరు, తంజావూరు మురసోలి, తేని తంగ తమిల్ సెల్వం, తుత్తుకుడి కనిమొళి, తెంకాసికాఱిచ కళ్లకురిచి మలైయరసన్ పోటీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News