Saturday, May 11, 2024

కేసీఆర్ అంటేనే కొత్త చరిత్ర రాయడంః ఎంఎల్‌ఏ జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

MLA Jeevan Reddy praised on CM KCR

మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం కేసీఆర్ అంటేనే కొత్త చరిత్ర రాయడమనీ, కొలువులూ చదువులూ రిజర్వేషన్ అనీ, కేసీఆర్ పేరుకి కొత్త ఎబ్రివేషన్ చెప్పారు ఆర్మూర్ ఎంఎల్‌ఏ జీవన్ రెడ్డి. రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ప్రకటన చేయడం పై హర్షం వ్యక్తం చేస్తూ, ఇంపాజబుల్ అనే నెగిటివ్ పధాన్ని ఐ యామ్ పాజబుల్ అని అనుకూలంగా మార్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఉద్యోగ నియామకాల్లో ఇది ఒక విప్లవత్మాక చర్య అంటూ ఆర్మూర్ ఎం ఎల్ ఏ జీవన్ రెడ్డి స్పందించారు. బుధవారం ఉదయం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనీ, ఎంపీ బండి సంజయ్ అసెంబ్లీ ముందు ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉండాలనీ విమర్శించారు. మార్చ్ 09 ప్రజలలో నిరుద్యోగులకు శుభదినమనీ, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నిరుద్యోగులకు దుర్దినమనీ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలలో ఉన్న ప్రతిపక్ష నాయకులంతా తమతమ పార్టీలు వీడి ప్రజలలో కలిసిపోవాలనీ, కేసీఆర్ ప్రభుత్వం తలపెట్టిన ఉద్యోగుల నియామకాలలో వీరందరికీ తలా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందంటూ చురకలంటించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళ కష్టాలు తీరాయనీ, రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలతో నిధులు కూడా ఫుల్ ఫిల్ అయ్యాయనీ, విద్యారంగానికి ఏడు వేల కోట్ల పైచిలుకు బడ్జెట్ కేటాయించామనీ, ఉపాద్యాయులకు ప్రమోషన్లు రానున్నాయనీ ఈ సందర్భంగా తెలియజేశారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పిన విధంగా 8.71 లక్షల ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీలు ఉన్నాయనీ, అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మరో 60 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేయబోతున్నారని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఇక విమర్శించడానికి ఏ వంకలూ లేవనీ, నీళ్లు ఇచ్చాం, నిధులు ఇచ్చాం, విద్య ఇచ్చాం, ఇక ఉద్యోగాలు ఇవ్వబోతున్నామంటూ తెలియజేశారు. విశ్వ కమిటీ 1,91000 ఉద్యోగాల ఖాళీలను చూపిస్తే, కేసీఆర్ 2 లక్షల పైచిలుకు ఉద్యోగ కేటాయింపులకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారనీ, 100 శాతం ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందనీ, త్వరలోనే ఆ శుభవార్త కూడా వింటారని తెలిపారు. ఇకపై నిజమైన నిరుద్యోగులు ప్రజలు కాదనీ, ప్రతిపక్ష నాయకులనీ, వారి కుట్రలు చెల్లవనీ అన్నారు. ఈ సంధర్భంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా వాళ్ళ కార్యాలయాల్లో పండుగ చేసుకోవాలనీ, ఎందుకంటే వాళ్ళ పిల్లలకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రాబోతున్నాయనీ, ఇది వారికి కూడా శుభవార్తేనని తెలిపారు. ఈ సంధర్భంగా బండి సంజయ్, రేవంత్ రెడ్డిలను అందరికీ స్వీట్లు పంచమని ఎద్దేవా చేశారు.

MLA Jeevan Reddy praised on CM KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News