Monday, April 29, 2024

తెలంగాణను కేంద్రం మోసం చేసింది: భట్టి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రంలో ఉన్నబిజేపి ప్రభుత్వం మోసం చేసిందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం అసెంబ్లీలో భట్టి మాట్లాడుతూ తాము ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ రాష్ట్రం ఇప్పించమన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేట కోచ్ ప్యాక్టరీ వంటివాటిని బిల్లులో పెట్టించామన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజేపి ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తొందని తాము తొలినుంచి చెబుతూ వచ్చినా పట్టంచుకోలేద్నారు. కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చేబుతున్నా లెక్కపెట్టలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రంతో పోరాడాలన్నారు విభజన చట్టం బిల్లులో లేకపోయినా ప్రధానమంత్రి నరేంద్రమోడి ఆనాటి ఖమ్మం జిల్లాలోని 7మండలాలను, 2లక్షల ఎకరాలను ఏపిలో కలిపేశారన్నారు. సీలేరు జలవిద్యుత్ ప్రాజెక్టుతోపాటు శబరి నదిని కూడా తెలంగాణ నుంచి కోల్పోయామన్నారు. తర్వాత కూడా మోడి ప్రభుత్వం చేసిన పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ బ్రహ్మాండం అంటూ వాటికి మద్దుతు తెలిపింది మీరు కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లోని అన్ని ఖాళీలు భర్తీ చేయాలన్నారు. మనది సంపద కలిగిన రాష్ట్రం అని రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే అన్నారు.రాష్ట్రంలో పెరిగిన సంపద తిరిగి ప్రజలకే చెందాలని భట్టివిక్రమార్క ప్రభుత్వాన్ని కోరారు.

Bhatti Vikramarka slams BJP at TS Assembly

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News